TikTok Durga Rao: CM కుర్చీలో టిక్ టాక్ లు అంటూ తప్పుడు ప్రచారం! అసలు నిజం ఇది!

CM కుర్చీలో టిక్ టాక్ లు అంటూ తప్పుడు ప్రచారం! అసలు నిజం ఇది!

సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య, వినియోగించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో అందులో దొరికే సమాచారం నిజమో, అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. రాజకీయ పరంగా ఇదొక ఆయుధంగా మారింది.

సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య, వినియోగించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో అందులో దొరికే సమాచారం నిజమో, అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. రాజకీయ పరంగా ఇదొక ఆయుధంగా మారింది.

నిజం గుమ్మం దాటేలోపు, అబద్దం ఊరంతా తిరిగి వస్తుంది. సోషల్ మీడియా వచ్చాక ఏదీ వాస్తవమో, ఏదీ అవాస్తవమో తెలుసుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది ఇంకా కష్టంగా మారింది. తాజాగా ఇటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ టిక్ టాక్ సెలబ్రెటీ చేసిన వీడియోని అడ్డం పెట్టుకుని, దానికి ఓ తప్పుడు సమాచారాన్ని జోడించి.. ఏకంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇంతకీ టిక్ టాక్ వీడియోస్ చేసుకునే దుర్గారావుకి, రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి లింక్ ఏంటి? అసలు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో వైరల్ అవుతున్న ఆ వీడియో ఏమిటి? అందులో ఉన్న అంశాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ యూట్యూబర్ టిక్ టాక్ దుర్గారావు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో.. అతను ఇలా చెప్పుకొచ్చాడు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చాను, పోలీసు పర్మిషన్‌తో కలిసి విజిట్ చేశాను, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవలేకపోయినా.. ఆయన కూర్చున్న కూర్చుని చూశాను. అందులో కూర్చున్నాను” అంటూ వీడియోని వదిలారు. నిజానికి ఆ వీడియోలో ఉన్నది సీఎం క్యాంపు ఆఫీస్ ఎంత మాత్రం కాదు, అది సీఎం చైర్ కాదు.అతడు ఫేమస్ అయ్యేందుకు సీఎం క్యాంపు కార్యాలయం అంటూ పేర్కొన్నాడు. దీంతో కావాలని ఈ ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సీఎం కార్యాలయంలోకి వీడియోలు ఎలా చేస్తారంటూ,ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నాయి. టిక్ టాక్ సీఎం, ఎలక్ట్రానిక్ సీఎం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య సమావేశాలు జరిగే సీఎం క్యాంపు కార్యాలయంలోకి బయట వారిని అనుమతించరు. పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వరు. కేవలం మంత్రులు, కార్యదర్శలకు మాత్రమే అందులోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ.. దుర్గారావు ఆ వీడియోలో తమాషాగా చెప్పిన మాటలను సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. దుర్గారావు తన వీడియోల్లో ఎంతటి అమాయకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తికి.. ఇంత సున్నితమైన అంశాల్లో తమాషా చేయకూడదని తెలిసి ఉండకపోవచ్చు. కానీ.., దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్న ప్రతిపక్షాల చర్య మాత్రం హేయమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments