Venkateswarlu
Venkateswarlu
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఫేక్ వార్తలు బాగా పెరిగిపోయాయి. కొద్ది మంది పొద్దు పోక, లేదా.. సోషల్ మీడియాలో ఫేమ్, మనీ సంపాదించడానికి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఓ ఫేక్ న్యూస్ కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తి బతికాడంటూ ప్రచారం జరిగింది. తర్వాత వైద్యులు దానిపై క్లారిటీ ఇవ్వటంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఎమ్మిగన్నూరు మండలం, మొగతి గ్రామానికి చెందిన పింజరి బాషా ఇంట్లో కిందపడిపోయాడు. దీంతో భాషా తలకు తీవ్ర గాయం అయింది. ఇది గమనించిన కుటుంసభ్యులు అతడ్ని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. తలకు గాయం అవ్వటంతో పాటు మూత్ర పిండాల సమస్య కూడా ఉంటంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు అతడికి ఈసీజీ తీయగా ఫ్లాట్‌గా వచ్చింది. వైద్యులు భాషా చనిపోయినట్లు ధ్రువీకరించారు. తర్వాత సీపీఆర్ చేయగా.. హార్ట్ బీట్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే చనిపోయిన వ్యక్తి బతికాడంటూ ప్రచారం మొదలైంది. మృతుడి బంధువు కూడా అవునని అన్నాడు. దీంతో ప్రచారం మరింత జోరుగా నడిచింది. అయితే, బాషాకు బ్రెయిన్ డెడ్ అయిందని, వెంటిలేటర్ తొలగించిన అనంతరం కూడా పల్స్ ఉంటుందని వైద్యులు తెలిపారు. మరోసారి ఈసీజీ తీయగా బాషా చనిపోయినట్లు తేలిందన్నారు. తర్వాత డెడ్ బాడీనీ కుటుంసభ్యులకు అప్పగించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.