P Krishna
ప్రేమ అనేది ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై కలుగుతోందో తెలియదు. ప్రేమలో ఉన్నవారు లోకాన్నే మర్చిపోతారని అంటారు. ముఖ్యంగా సోషల్ మాధ్యామాల్లో ఏర్పడ్డ పరిచయాలు ప్రేమగా మారి.. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు.. ఇలా ఎల్లలు దాటి పోతున్నాయి.
ప్రేమ అనేది ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై కలుగుతోందో తెలియదు. ప్రేమలో ఉన్నవారు లోకాన్నే మర్చిపోతారని అంటారు. ముఖ్యంగా సోషల్ మాధ్యామాల్లో ఏర్పడ్డ పరిచయాలు ప్రేమగా మారి.. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు.. ఇలా ఎల్లలు దాటి పోతున్నాయి.
P Krishna
ప్రేమ అంటే ఓ మధురానుభూతి.. ప్రేమలో ఉన్నవారు ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారని అంటారు. ప్రేమికులు హద్దులు, కుల, మత, భాష, ప్రాంతాల భేదాలు ఏవీ పట్టించుకోరు. తమ ప్రేమను సాధించేందుకు దేనికైనా సిద్దపడతారు. సోషల్ మాధ్యమాల్లో పరిచయాలు ప్రేమగా మారి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు ప్రేమలు ఎల్లలు దాటిపోతుంటాయి. ఇరువురి పెద్దల అంగీకారంతో పరదేశీయులను పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా కోనసీమ అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో హిందూ వివాహ సంప్రదాయపద్దతిలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వివరాల్లోకి వెళితే..
ప్రేమ అనేది ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుంతో తెలియదు. అలాంటి ప్రేమలు రాష్ట్రలు, దేశాలు, ఖండాలు దాటి ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు ఎన్నో జంటలు. విదేశాల్లో చదువు కోసం వెళ్లినవారు, ఉద్యోగ రిత్యా వెళ్లిన వారు.. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వారు ప్రేమలో పడి పెళ్లి పీటలు వరకు నడిపించిన ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీ పేటకు చెందిన సంజనా కోటేశ్వరి చదువు పూర్తి చేసుకొని స్పెయిన్ లో జాబ్ చేస్తుంది. ఆ దేశంలో ఓ బ్యాంక్ లో ఎంప్లాయ్ గా విధులు నిర్వహిస్తున్న రోసిజ్ఞాని తో సంజనకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
బుధవారం దిండి రిసార్ట్స్ లో ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. స్పెయిన్ నుంచి వరుడి తల్లిదండ్రులు ఇతర బంధువులతో కలిసి వచ్చాడు. అప్పటి నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను పద్దతిగా జరిపించారు. ఇక పెళ్లికి హాజరైన స్పెయిన్ యువతులు చీరలు కట్టుకున్నారు.. యువకులు పంచలు, కుర్తా పైజామాలు ధరించి సంప్రదాయంగా కనిపించారు. ఈ వివాహవేడుకకు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.