iDreamPost
android-app
ios-app

VIDEO: ఫైన్‌ వేశారని.. పోలీస్‌ స్టేషన్‌కే కరెంట్‌ సరఫరా నిలిపివేశారు!

  • Published Aug 27, 2023 | 4:53 PM Updated Updated Aug 27, 2023 | 4:53 PM
  • Published Aug 27, 2023 | 4:53 PMUpdated Aug 27, 2023 | 4:53 PM
VIDEO: ఫైన్‌ వేశారని.. పోలీస్‌ స్టేషన్‌కే కరెంట్‌ సరఫరా నిలిపివేశారు!

కొంతకాలంగా వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోయినా, రాంగ్‌రూట్‌లో వాహనం నడిపినా.. ట్రాఫిక్‌ పోలీసులు జస్ట్‌ ఒక్క క్లిక్‌తో వారి జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. తమ వద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్‌తో ఒక్క ఫొటో తీసేసి.. ఆన్‌లైన్‌లో వారిపై ఫైన్‌ వేస్తున్నారు. దీంతో పోలీసులు కెమెరా కంటి నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు చాలా పాట్లు పడుతున్నారు. కానీ, చాలా మంది పోలీసులు కంటి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో భారీగా ఫైన్ల బారిన పడుతున్నారు.

సాధారణ ప్రజలు పోలీసులు వేసిన ఫైన్‌ ఇంకే మాట్లాడకుండా కట్టేస్తుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలోని ఓ లైన్‌మెన్‌ తన బండికి పోలీసులు ఫైన్‌ వేశారని, ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వీడియో తీస్తూ.. బైక్‌కు చలాన్‌ వేసినందుకే కదా నువ్వు లైన్‌ కట్‌ చేసిందని అని అడుగుతుంటే విద్యుత్‌ శాఖ ఉద్యోగులు సమాధానం చెప్పడం లేదు. కిందున్న వీడియో చూసి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత! నంద్యాలలో దారుణ ఘటన