Dharani
మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని.. లేదంటే జైలుకే అంటున్నారు అధికారులు.
మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని.. లేదంటే జైలుకే అంటున్నారు అధికారులు.
Dharani
ఐదేళ్ల పాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అతి శక్తివంతమైన అస్త్రం ఓటును ఉపయోగించుకునేందుకు సమయం దగ్గర పడుతుంది. మే 13, సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దాంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఫుల్లు రద్దీ కనిపిస్తోంది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి.. గంటల కొద్ది ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇక ఓటు వేయడానికి వెళ్లే వారికి కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఓటు వేసే సమయంలో మీరు గనక ఇలాంటి పనులు చేస్తే.. జైలుకే వెళ్తారు అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో మే 13, సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. నేటి నుంచి హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అలానే ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు.