iDreamPost
android-app
ios-app

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు వైన్స్ బంద్!

  • Published May 29, 2024 | 11:19 AMUpdated May 29, 2024 | 11:19 AM

Election Commission: ఎన్నికిల ఫలితాల వేల మందుబాబులకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీలో జూన్ 4 న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలబడబోతున్నాయి.

Election Commission: ఎన్నికిల ఫలితాల వేల మందుబాబులకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీలో జూన్ 4 న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలబడబోతున్నాయి.

  • Published May 29, 2024 | 11:19 AMUpdated May 29, 2024 | 11:19 AM
ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు వైన్స్ బంద్!

ఇటీవల దేశంలో వరుసగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, కొట్లాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మొత్తం మూసివేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశంలో ఐదు విడదల ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీలో మే 13 న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4 న ఫలితాలు వెలవడబోతున్నాయి. ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదని మూడు రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే..

ఏపీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4 న జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 3 నుంచి జూన్ 5 వరకు మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హైూటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఏపీలో భారీ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందుగా మద్యం షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలు మూసివేస్తుంటారు. పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం ముగిసే రోజు నుంచి వైన్స్ షాపులు మూసివేస్తారు. అలాగే పోలింగ్ రోజు సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి.. ఇక రిజల్ట్ సందర్భంగా జూన్ 4 న వైన్స్ షాపులు మూసివేస్తున్నారు. ఏపీలో మూడు రోజుల పాటు డ్రై డే గా ఉండనుంది. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే మద్యం షాపులు మూసివేత కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డగోలిగా రేట్లు పెంచి దొంగచాటుగా అమ్ముతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి