iDreamPost
android-app
ios-app

Chandrababu, EC: చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం!

ఏపీలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కౌటింగ్ ముగిసే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

ఏపీలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కౌటింగ్ ముగిసే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

Chandrababu, EC: చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎవరైన ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే.. సంబంధిత వ్యక్తులపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. అలానే అభ్యతరమైన విషయలపై సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తే.. ఈసీ చర్యలకు పూనుకుంటుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులపై దూషణలు, అలానే ప్రచారంలో డబ్బుల వినియోగం వంటి అనేక అంశాలపై ఎన్నికల సంఘ కన్నేసి ఉంచుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన ప్రవర్తిస్తే..రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగుతుంది. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిని అరెస్టు చేసి.. జైలుకు కూడా పంపిస్తుంది. అలానే ఎవరైనా రూల్స్ ను పాటించకుంటే..నోటీసులు జారీ చేస్తుంది.

ఇలా ఎన్నికల వచ్చిన ప్రతిసారీ ప్రముఖలకు సైతం ఈసీ నోటీసులు జారీ చేస్తుంది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. వైఎస్సార్ సీపీ ఫిర్యాదు  మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై  తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి  ఎన్నికల సంఘాన్నికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా మాద్యమాలైన ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎన్నిక ప్రధాన అధికారి స్పష్టం చేశారు. గత శనివారం కేంద్ర ఎన్నికల సంఘంట లోక్ సభ ఎన్నికలతో పాటు  ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగో విడతలో మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరగనుంది. అలానే జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తంగా ఎన్నికల వేళ చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తె లియజేయండి.