Tirupathi Rao
EC Notice To Pawan Kalyan: జనసేన అధికనే పవన్ కల్యాణ్ కు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. పవన్ కల్యాణ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు.
EC Notice To Pawan Kalyan: జనసేన అధికనే పవన్ కల్యాణ్ కు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. పవన్ కల్యాణ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకొంది. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ ఐదేళ్లు చేసిన సంక్షేమాన్ని చూపిస్తూ.. సామాన్యులే తమ స్టార్ క్యాపైనర్లు అంటూ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. కానీ, ప్రతిపక్షం మాత్రం ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక అధికార పక్షం మీద విమర్శలు, ఇష్టారీతిన పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. ఈ విషయంలో కూటమికి ఎన్నికల అధికారులు షాకిచ్చారు. సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ ఈసీ పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
పవన్ కల్యాణ్ కు నుంచి ఈసీ బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ 7న అనకాపల్లిలో సీఎం జగన్ మీద పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ కోరుతూ ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ కు కేవలం 48 గంటల సమయాన్ని డెడ్ లైన్ గా పెట్టారు. అనకాపల్లిలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు స్పందించారు. పవన్ కల్యాణ్ పై వచ్చిన ఫిర్యాదుకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
మరోవైపు తెలుగుదేశం నేతలపై కూడా మల్లాది విష్ణు అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్యలపై విష్ణు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చినా కూడా చంద్రబాబు తీరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సీఎం జగన్ పై ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ను కించ పరిచే విధంగా మాటలు మాట్లాడటం, పాటలు రూపొందించడం చేస్తున్నారన్నారు. జరుగు జరుగు జగన్ అనే పాటను రూపొందిస్తున్న విషయాన్ని తెలిపారు. చంద్రబాబు మాత్రమే కాకుండా.. వర్ల రామయ్య, అయ్యన్న పాత్రుడు కూడా సీఎం జగన్ కించ పరిచే విధంగానే మాట్లాడుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ కు ఈసీ నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.