iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాలుగు రైళ్లకు అదనపు కోచ్ లు!

East Coast Railway: మూడు రోజుల క్రితం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి..జనరల్ బోగీలు పెంచుతామని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది.

East Coast Railway: మూడు రోజుల క్రితం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి..జనరల్ బోగీలు పెంచుతామని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాలుగు రైళ్లకు అదనపు కోచ్ లు!

నిత్యం ఎంతో మంది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదే సమయంలో ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వేశాఖ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అనేక అభివృద్ధి పనులు చేస్తూ.. ప్రయాణికుల రైళ్లు జర్నీని సుఖంగా సాగేలా చేస్తుంది. తరచూ వివిధ విషయాల్లో ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్తలు చెబుతుంది. తాజాగా ఈస్ట్ కోస్టు రైల్వే గుడ్ న్యూస్ అందించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈస్ట్‌కోస్టు రైల్వే నాలుగు రైళ్లకు స్లీప‌ర్‌, ఏసీ కోచ్‌లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ పరిధిలో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు ట్రైన్లలో అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ భోగీలను పెంచాలని నిర్ణయించింది. అవి కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లలో ఈ అదనపు కోచ్ లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం, అమృతసర్ మధ్య నడిచే రెండు రైళ్లలో ఈ అదనపు కోచ్ లోను ఏర్పటు చేయనున్నారు. వైజాగ్, అమృతసర్ మధ్య నడిచే హిరాకుడ్  ఎక్స్ ప్రెస్ (20807, 20808) రైళ్లలో అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 3, 7వ తేదీల్లో నుంచి  ఈ రెండు రైళ్లలోలో అదనపు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయి.

Additional coaches for those trains!

అదేవిధంగా విశాఖ‌ప‌ట్నం నుంచి నాందేడ్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన అమ‌లులోకి రానుంది. ఇవి సెప్టెంబ‌ర్ 3 నుంచి అమలులోకి వస్తాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. అదేవిదంగా నాందేడ్ నుంచి విశాఖకు బయలుదేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (20812) రైలు కూడా ఒక స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లను అదనంగా కలపనున్నారు. సెప్టెంబ‌ర్ 4 నుంచి ఈ కోచ్‌లో అమలులోకి వస్తాయి. ఈ నాలుగు రైళ్లలో తీసుకొచ్చిన అదనపు కోచ్ ల సౌకర్యాన్ని ప్రజ‌లు వినియోగించుకోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కే. సందీప్ సూచించారు. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి..దశల వారీగా జనరల్ బోగీల సంఖ్యను పెంచుతామని తెలిపారు. తాజాగా ఈస్ట్ కోస్ట్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మరి.. ఈస్ట్ కోస్ట్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.