Arjun Suravaram
Andhra Pradesh: ప్రతి ఒక్కరు కరెంట్ బిల్లును చెల్లిస్తుంటారు. కొందరు నేరుగా ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్లి చెల్లిస్తుంటే..మరికొందరు ఆన్ లైన్ల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గంలో మోసం చేస్తున్నారు.
Andhra Pradesh: ప్రతి ఒక్కరు కరెంట్ బిల్లును చెల్లిస్తుంటారు. కొందరు నేరుగా ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్లి చెల్లిస్తుంటే..మరికొందరు ఆన్ లైన్ల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గంలో మోసం చేస్తున్నారు.
Arjun Suravaram
నేటికాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా దొంగతనాలు చేస్తూ..అందినకాడికి దొచుకేళ్తున్నారు. మరికొందరు సైబర్ మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి డబ్బులను లూటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఆన్‌లైన్ మోసాలు పాల్పడుతున్నారు. ఇటీవల నార్కోటిక్ పోలీసులమని, వర్కు ఫ్రమ్ హోం వంటి వివిధ పేర్లతో ఎంతో మంది ప్రజలను ముంచేశారు. తాజాగా విద్యుత్ బిల్లులు చెల్లింపుల పేరుతో మోసాలు మొదలయ్యాయి. దీంతో కరెంట్ బిల్లులు చెల్లించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి.. అసలు సంగతి ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రతి ఒక్కరు కరెంట్ బిల్లును చెల్లిస్తుంటారు. కొందరు నేరుగా ప్రభుత్వ ఆఫీస్ లకు వెళ్లి చెల్లిస్తుంటే..మరికొందరు ఆన్ లైన్ల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు సైబర్ కేటుగాళ్లు మేసేజ్ లు పంపిస్తున్నారు. కరెంట్ బిల్లు చెల్లించవచ్చంటూ వాట్సాప్ ద్వారా ఏపీకే లింక్ పంపిస్తున్నారు. అలా ఎవరైనా తెలియక లింక్ చేస్తే.. వారి నుంచి ఆన్ లైన్ లో అందిన కాడికి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో కరెంట్ బిల్లులు చెల్లించే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ యాప్‌ల ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు ఉపయోగించిన సంగతి తెలిసిందే.
గత నెల నుంచి ఆయా యాప్‌ల ద్వారా బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేశాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసగాళ్లు ఈ కొత్త మార్గంలో పలువురికి ఏపీకే ఫైల్ పంపుతూ మోసం చేస్తున్నారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. కరెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కరెంట్ బిల్లు చెల్లించేందుకు ఎదురుచూస్తున్నారా.. అంటూ మాట కలుపుతున్నాడు. మన వాట్సాప్ నెంబర్ కి ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ పేరుతో ఉన్న ఓ నంబరు నుంచి ఎలక్ట్రిసిటీ అనే ఏపీకే ఫైల్ లింక్ ను ఓ మెసేజ్ రూపంలో పంపుతున్నాడు. ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేసి కరెంట్ బిల్లు చెల్లించుకోవచ్చని అంటారు.
వారి మాటలు నమ్మి ఒకవేళ పొరపాటున ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేస్తే.. నిమిషాల వ్యవధిలో మాల్‌వేర్ ఫోనులోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారంతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు వంటి ప్రతీ సమాచారం సైబర్ కేటుగాళ్లకు చేరుతుంది. ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు, కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈస్ట్రన్ పవర్ పేరుతో ప్లేస్టోర్‌లోని అందుబాటులో ఉన్న యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాలని సంస్థ తెలిపింది.