Krishna Kowshik
బ్యాంకులు అంటే విపరీతమైన నమ్మకం ఉంది ప్రజలకు. ఆర్థిక లావాదేవీలు చేయలన్నా, పెద్ద మొత్తంలో నగదు బదిలీలు చేయాలన్నా, బంగారాన్ని తాకట్టు పెట్టాలన్నా ముందుగా ఆశ్రయించేంది బ్యాంకులనే. కానీ ఆ బ్యాంకులోని ఉద్యోగులు
బ్యాంకులు అంటే విపరీతమైన నమ్మకం ఉంది ప్రజలకు. ఆర్థిక లావాదేవీలు చేయలన్నా, పెద్ద మొత్తంలో నగదు బదిలీలు చేయాలన్నా, బంగారాన్ని తాకట్టు పెట్టాలన్నా ముందుగా ఆశ్రయించేంది బ్యాంకులనే. కానీ ఆ బ్యాంకులోని ఉద్యోగులు
Krishna Kowshik
ప్రభుత్వ బ్యాంకులు అంటే నమ్మకానికి అమ్మ వంటివి. ఇక్కడ డబ్బుకు భద్రత ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తుంటారు. అలాగే ఇంట్లో సేఫ్టీ ఉండదని, అవసరాల నిమిత్తం బంగారాన్ని ఇక్కడే కుదువ పెడుతూ ఉంటారు. ఆర్థిక అవసరాలకు, లావాదేవీలకు ముందుగా ఆశ్రయించేది బ్యాంకులనే. అలాంటి బ్యాంకు వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది ప్రజలకు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉద్యోగులే చేతి వాటం ప్రదర్శిస్తూ.. ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. తాజాగా అటువంటి ఓ సంఘటన వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా కస్టమర్ల ఆందోళనకు బలం చేకూరేలా బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అయోమయంలో పడ్డారు కస్టమర్లు.
శ్రీకాకుళం జిల్లా గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వ్యవహారంలో సుమారు రెండు వారాల నుండి ఆందోళన నెలకొంది. తాము తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడానికి కస్టమర్లు వస్తుంటే.. బ్యాంకు అధికారులు ఏదో ఒకటి చెప్పి.. తిప్పి పంపించేస్తున్నారు. దీంతో తమ గోల్డ్ బ్యాంకు నుండి మిస్ అయ్యిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఖాతాదారులు బంగారం తాకట్టు పెట్టడానికి లేదా విడిపించుకోవడానికి వస్తున్నా రేపు, మాపు అంటూ తిప్పుతున్నారు. దీంతో కుదవ పెట్టిన నగలు మిస్ అయ్యాయని, బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగిని పాత్ర ఉందని తెలుస్తోంది. దీంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. అయితే ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మీ గోల్డ్ సేఫ్‌గా ఉందని స్పష్టం చేశారు. ఆడిట్ జరుగుతోందని డిసెంబర్ 8న మీ బంగారాన్ని అప్పగిస్తామని చెప్పారు.
కానీ ఇంతలో ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. అదే బ్రాంచ్‌కు చెందిన డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్న ప్రియ మంగళవారం రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించగా.. కుటుం సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను విశాఖకు తరలించారు. బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. దీంతో తమ బంగారం మిస్ అయ్యిందా అనే ఆందోళనలో పడిపోయారు ఖాతాదారులు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం సుమారు 60 బ్యాగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అవీ కనిపించడం లేదని ప్రచారం జరుగుతుంది. క్యాష్ ఇన్చార్జ్ సురేష్ ఇటీవల మూడురోజుల పాటు సెలవులు ఉండటంతో మరో ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పగించారు.
సదరు ఉద్యోగి.. సహ ఎంప్లాయ్ అన్న నమ్మకంతో తాళాలు స్వప్నకు అప్పగించాడని, ఇదే అదునుగా భావించి.. ఆమె తీసినట్లు ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. సెలవు తర్వాత ఉద్యోగంలో చేరిన సురేష్.. బంగారు ఆభరణాలు కనిపించకుండా పోవడంతో విషయం బయటకు పొక్కిందని, అందుకే కస్టమర్లను మేనేజ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బంగారం చోరీ వెనుక ఉన్నతాధికారి హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఆ అధికారి కొత్త కారు కొనడం ఈ ఆరోపణలకు బలమిచ్చినట్లు అయ్యింది. అయితే తమ గోల్డ్ తమకు అప్పగించాలని ఆందోళన చేస్తున్నా.. బ్యాంకు ఉద్యోగులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కాలయాపన చేస్తున్నారని కస్టమర్లు అంటున్నారు. కొంత బంగారాన్ని స్వప్న ప్రియ నుండి రికవరీ చేశారని, మిగతా బంగారాన్ని స్వంత ఖర్చులకు వాడుకోవడంతో తిరిగి వాటిని తీసుకురాలేక, ఖాతాదారులకు, ఇతరులకు సంజాయిషీ చెప్పలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీని వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.