iDreamPost
android-app
ios-app

భర్తను చంపి జైలుకెళ్లిన భార్య.. అక్కడ కూడా షాకింగ్ ట్విస్ట్

  • Published Apr 26, 2024 | 5:39 PM Updated Updated Apr 26, 2024 | 5:39 PM

ఆ విషయంలో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త చెబుతున్న దానికి నిరాకరించింది భార్య. దీంతో పాపపై దారుణానికి ఒడిగట్టబోయాడు. చివరకు భర్తను చంపేసింది భార్య. పోలీసులు అరెస్టు చేశారు.. కానీ అక్కడకు వెళ్లాక

ఆ విషయంలో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త చెబుతున్న దానికి నిరాకరించింది భార్య. దీంతో పాపపై దారుణానికి ఒడిగట్టబోయాడు. చివరకు భర్తను చంపేసింది భార్య. పోలీసులు అరెస్టు చేశారు.. కానీ అక్కడకు వెళ్లాక

  • Published Apr 26, 2024 | 5:39 PMUpdated Apr 26, 2024 | 5:39 PM
భర్తను చంపి జైలుకెళ్లిన భార్య.. అక్కడ కూడా షాకింగ్ ట్విస్ట్

ఆడది ఏ పోరైనా తట్టుకోగలదు కానీ సవితి పోరును మాత్రం సహించదు.. భరించదు. అందుకే పక్కింటి ఆడవాళ్ల భర్తను అన్నయ్య అని పిలిచి.. ఆ ఇంటి ఇల్లాలిని తన భర్తకు చెల్లిని లేదా అక్కను చేసేస్తుంది. కానీ క్షణిక సుఖానికి అలవాటు పడ్డ మగాడు.. మరో అమ్మాయితో రాసలీలలు సాగిస్తున్నాడు. భార్య కన్ను గప్పి.. తన ప్రేయసితో మరో కాపురం పెట్టి ఆమె వద్ద గంటలు గంటలు గడిపేస్తుంటారు. ఆమెతోనే సినిమాలు, షికార్లు, సరదాలు. ఇవన్నీ భార్యకు తెలియని నాడు ఓకే.. కానీ తెలిస్తే.. భార్య కచ్చితంగా నిలదీస్తుంది. తను చస్తుంది.. లేకుంటే భర్తను చంపడానికి కూడా వెనుకాడదు. భర్త మరో అమ్మాయితో గడుపుతున్నాడని తెలిసి నిలదీసిందో భార్య. భర్త చెప్పిన విషయాన్ని తట్టుకోలేక.. అతడ్ని చంపేసింది.

ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆమె జైలులో ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జైలులో మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. మృతురాలి సోదరి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యప్ప, దుర్గ భార్యా భర్తలు. వీళ్ల కాపురం కొన్నాళ్ల పాటు సవ్యంగానే సాగిపోయింది. కాగా, అయ్యప్ప ఇటీవల రాజేశ్వరి అనే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్యా భర్తల మధ్య తగాదాలు జరగుతున్నాయి. ఆ అమ్మాయి కూడా తనకు కావాలంటూ.. అందుకు అంగీకరించాలంటూ భార్య దుర్గను కొట్టేవాడు. కాగా,ఓ రోజు తాగి వచ్చిన అయ్యప్ప.. వారి పాపపై రోకలి బండ ఎత్తి కొట్టబోతుంటే.. భార్య వచ్చి అడ్డుకుని.. తిరిగి భర్తపై దాడి చేయడంతో అతడు మరణించాడు.

అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉంది. కాగా, సోదరి ఏమన్నారంటే.. వచ్చే మంగళవారం రిమాండ్ ఉండగా.. నిన్న ఫోన్ చేసి.. ‘జ్వరంగా ఉంది, ఒళ్లు నొప్పులుగా ఉన్నాయి’ అని మాట్లాడింది. వెంటనే ఇప్పుడు ఎండగా ఉంది కదా.. వచ్చే మంగళవారం పిల్లల్ని తీసుకుని చూపిస్తాను అని చెప్పాను. అంతలో దుర్గ ఆత్మహత్య చేసుకుంది అంటూ తనకు ఫోన్ చేశారు.  ఇక్కడకు రాగానే మీ చెల్లి ఉరి వేసుకుని చనిపోయిందని పోలీసులు వెల్లడించారు అంటూ తెలిపింది. దుర్గ డెడ్ బాడీని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio