Arjun Suravaram
YS Jagan: మిచౌంగ్ తుపాన్ ఏపీలో సృష్టించిన బీభత్సం అంతాఇంతాకాదు. ఏపీలోని పలు జిల్లాలు ఈ తుపాన్ ధాటికి విలవిల్లాడాయి. ఇక బాధితులను కాపాడే క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
YS Jagan: మిచౌంగ్ తుపాన్ ఏపీలో సృష్టించిన బీభత్సం అంతాఇంతాకాదు. ఏపీలోని పలు జిల్లాలు ఈ తుపాన్ ధాటికి విలవిల్లాడాయి. ఇక బాధితులను కాపాడే క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Arjun Suravaram
మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. దీని ధాటికి తమిళనాడు, ఏపీ అల్లకల్లోలంగా మారాయి. ఇక చెన్నై నగరమంతా నీట మునిగింది. ఏపీలోని పలు జిల్లాల్లో తుఫాన్ కారణంగా భారీ వానలు పడ్డాయి. నిన్ననే తుఫాన్ తీరం దాటి బలహీనపడింది. ఇక బాధితులను ఆదుకునేందుకు పోలీసులు, రెవెన్యూ, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. విధి నిర్వహణలో ఎందరో ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి మరి.. సామాన్యులకు సాయం అందించారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ కానిస్టేబులు మృతి చెందారు. ఆయన విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మిచౌంగ్ తుపాన్ వరద బాధితుల సహాయంతో పాటూ ప్రస్తుతం పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. అధికారులంతా వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలన్నారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు. బాధితుల్లో మనం ఉంటే ఎలాంటి సాయం ఆశిస్తామో.. అదే తరహా సహయం వారికి అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు. బాధితులకు మంచి సహాయం ఆందాలని సీఎం జగన్ కోరారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి సొంత ఇళ్లకి పంపించే సమయంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక , ఇతర సహాయం ఇవ్వాలన్నారు. రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం, జాప్యం ఉండకూడదని సీఎం జగన్ అధికారులకు హెచ్చరించారు. స్తంభాలు నేలకోరిన.. వాటిని సరి చేసి.. విద్యుత్ పునురుద్ధరించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు, రోగాలు రాకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండని సీఎం ఆదేశించారు.
చెట్టుకూలి మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సాయంఅందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు స్థైర్యంగా నిలబడేలా ప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలిపారు. వాలంటీర్ల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు మన ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. అంతేకాక తుపాన్ కారణంగా భారీగా నష్టపోయిన రైతుల విషయంలో కూడా సీఎం జగన్ మంచి మనస్సు చాటుకున్నారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని అధికారులను ఆదేశించారు. గడిచిన 48 గంటల్లోనే 1.07 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరి.. కానిస్టేబులు విషయంలో జగన్ సర్కార్ చేసిన ఆర్థిక సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.