Arjun Suravaram
Arjun Suravaram
ప్రజల మాన, ప్రాణాలను, ఆస్తులను కాపాడటం పోలీసుల బాధ్యత. అలానే నేరాలను అరికడుతూ పౌరులకు రక్షణ కల్పిస్తుంటారు. ఇలా విధుల్లో నిజాయితీగా ఉంటూ ఎందరో పోలీసులు పేరు ప్రతిష్టలు సంపాదించారు. కానీ కొందరు మాత్రం అవినీతి, అక్రమ సంపాదనకు అలావాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. వారు చేసే పనులతో పోలీస్ శాఖకు అపకీర్తి తెస్తున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ చేసిన నిర్వహకం ఛీ… అనేలా చేసింది. లంచం కోసం ఓ కానిస్టేబుల్ రెండు కిలోమీటర్ల మేర ఓ వాహనాన్ని ఛేజింగ్ చేశాడు. రాత్రివేళ రూల్స్ మాట్లాడి వాహనాన్ని అరగంటపాటు నిలిపేసి… రెండు వందలు లంచం తీసుకుని ఏమీ ఎరగనట్లు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పల్నాడు జిల్లాకు చెందిన ఓ రైతు కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఆ సంతోషంలో వారి కుటుంబం పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి బయల్దేరింది. మొక్కులు చెల్లించుకుందామని కుటుంబం మొత్తం రాత్రివేళ ఓ బొలెరో వాహనంలో ప్రయాణమయ్యారు. అయితే బెల్లంకొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ ఆ వాహనాన్ని గమనించాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు ఆ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించిన కానిస్టేబుల్.. ఆ తరువాత అడ్డగించాడు.
సరుకులు తీసుకెళ్లే వాహనంలో ప్రయాణికులు ఎక్కకూడదంటూ వాహనాన్ని నిలిపేశాడు. తాము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. అరగంట పాటు వారిని నిలిపివేశాడు. ఆ తర్వాత రెండు వందల రూపాయలు లంచం తీసుకుని వదిలేశాడు. ఈ తంతగం మొత్తాన్ని వీడియో తీసిన బొలెరోలోని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కానిస్టేబుల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.