iDreamPost
android-app
ios-app

బుచ్చ‌య్యకి చంద్రబాబు పొలిటికల్ పోటు ! ఇదే బాబు రూటు!

టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరో నేత బాధ్యుడు కాబోతున్నట్లు తెలుస్తోది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు మరో నేత బాధ్యుడు కాబోతున్నట్లు తెలుస్తోది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలుస్తోంది.

బుచ్చ‌య్యకి చంద్రబాబు పొలిటికల్ పోటు ! ఇదే బాబు రూటు!

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షపార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో కలిసి పోటీచేయబోతోంది. ఈ క్రమంలో సీట్ల అంశంపై టీడీపీ, జనసేనలు చర్చలు కూడా జరిపాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటును జనసేనకు కేటాయించేందుకు బాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. అలాంటిది ఒకప్పుడు ఎన్టీఆర్ వర్గంలో పనిచేసిన బుచ్చయ్య చౌదరిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని పలువురు అంటున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ వర్గంలో కొనసాగారు. ఆ సమయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు బుచ్చయ్య చౌదరి. అప్పటి నుంచి బాబు బుచ్చయ్య చౌదరిపై కపట ప్రేమనే చూపిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినటువంటి బుచ్చయ్య చౌదరిని కేబినెట్ లోకి తీసుకోపోగా వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. దీన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు.

తర్వాత టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బుచ్చయ్య చౌదరి బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేష్ కు ఫోన్ చేసినా స్పందించరని దుయ్యబట్టారు. అంతేగాక టీడీపీకి గత వైభవం సంతరించుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలని ముక్తకంఠంతో తెలిపాడు. దీంతో మరింత రగిలిపోయిన చంద్రబాబు బుచ్చయ్య చౌదరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. రాజమండ్రి రూరల్ సీటును జనసేనకు కేటాయించి బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు పన్నాగం పన్నుతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కాగా రాజమండ్రి రూరల్ జనసేన ఇంచార్జీ కందుల దుర్గేష్ సీటు తనదేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు సిట్టింగులకు సీట్ల విషయంపై కొందరు త్యాగాలకు కూడా సిద్దమవ్వాలని చెప్పారని కందుల దుర్గేష్ తెలియజేయడంతో దీనికి మరింత బలం చేకూరినట్లైంది. ఇక దీనిపై బుచ్చయ్య చౌదరి మండిపడుతున్నారు. తన సీటు విషయయాన్ని జనసేన ఇంచార్జ్ నిర్ణయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు తనను దూరం చేసేందుకే బాబు కుట్ర చేసి జనసేనకు రాజమండ్రి రూరల్ సీటు కేటాయించాలని చూస్తున్నారని బుచ్చయ్య చౌదరి రాజకీయ సన్నిహితుల వద్ద తన ఆవేధన వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు కుట్ర పన్నడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.