iDreamPost
android-app
ios-app

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: CM జగన్

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక పండగను పురష్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలందరీకీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక పండగను పురష్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలందరీకీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: CM జగన్

భారతీయులు దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు దీపావళి పండగ కావడంతో ప్రజలందరూ కొత్త దుస్తులు ధరించి…దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. అలానే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసుకుని అందరు పంచుకుంటున్నారు. ఇక మరికొందరు అయితే టాపాసులను కాల్చుతూ సందడి చేస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ప్రముఖులు ప్రజలను ఉద్దేశించి..దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు విషెష్ చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దేశ వ్యాప్తంగా దీపావళి పండగను ఎంతో ఘనంగా జరపుకుంటున్నారు. దీపాలను వరసగా పేర్చుకుని జరుపుకునే అద్భుతమైన పండుగ దీపావళి. చీకటిని తరిమికొట్టి… సత్యమే జయిస్తుంది అని చెప్పడమే దీపావళి ప్రధాన ఉద్దేశం. అలానే శాస్త్రీయంగా దీపావళికి జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. వర్షాకాలం వెళ్లి… శీతాకాలం వస్తున్న సమయంలో… పెద్ద సంఖ్యలో దోమలు, ఈగలు, ఇతరత్రా క్రిమి కీటకాలు, వైరస్ వంటివి వస్తుంటాయి. వాటి నుంచీ మనకు విముక్తి కలిగించేందుకు పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చుతారు. తద్వారా పొగ వెలువడి… చెడు జీవులు అంతరిస్తాయని పెద్దలు చెబుతుంటారు. దీపావళి  పండగ నాడు ఇళ్లను నీటితో పరిశుభ్రం చేసుకుంటారు. ఇక పండగ వేళ అందరూ పరస్పరం శుభాకాంక్షలు చెబుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ప్రజలకు విషెష్ తెలియజేస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఆ ఎక్స్ వేదికగా..‘దీపావళి అంటేనే కాంతి-వెలుగు. చీకటిపై వెలుగు..చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం..దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ.ఈ పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నానని సీఎం జగన్‌ పేర్కొన్నారు.