iDreamPost
android-app
ios-app

గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. నేడు 4 లక్షల మంది ఖాతాల్లోకి రూ.47 కోట్లు

  • Published Jan 18, 2024 | 10:56 AM Updated Updated Jan 18, 2024 | 10:56 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సుమారు 4 లక్షల మంది ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సుమారు 4 లక్షల మంది ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

  • Published Jan 18, 2024 | 10:56 AMUpdated Jan 18, 2024 | 10:56 AM
గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. నేడు 4 లక్షల మంది ఖాతాల్లోకి రూ.47 కోట్లు

ప్రతి మనిషికి ఉండే అతి సామాన్యమైన కోరిక.. వారి కంటూ సొంతంగా ఓ ఇల్లు ఉండటం. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పేద వారి సొంతింటి కల సాకారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రారంభించాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో పేదలు సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా ఉంది. నవరత్నాల పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం తీసుకువచ్చారు సీఎం జగన్‌. దీని ద్వారా పేదలకు ఇంటి స్థలం పంపిణీ చేయడంతో పాటు.. ఇళ్లను మంజూరు చేసి.. నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు.. రాయితీపై ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని కూడా అందిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా నేడు రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. పేదలందరికి ఇళ్ల పథకం లబ్ధిదారులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నారు. దీని కింద రాష‍్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఖాతాల్లో రూ.47 కోట్లు జమ చేయనున్నారు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీని జగన్ సర్కార్ రియంబర్స్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డాదికి రెండు సార్లు ఆ డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీనిలో భాగంగానే నేడు వర్చువల్‌గా జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

47 crores into the accounts of 4 lakhs people

నవరత్నాలు పథకంలోని పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలం, ఇల్లు మంజూరు చేయడమే కాక నిర్మాణం కోసం లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు తొలి విడతలో వడ్డీని నేడు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయితే మహిళలపై ఈ భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది జగన్ సర్కార్.

దీనిలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.77 లక్షల మందికి రూ.4,500.19 కోట్లు బ్యాంకు లోన్లను ప్రభుత్వం అందించింది. వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు నేడు ఈలోన్లకు సంబంధించిన వడ్డీ రీఎంబర్స్‌మెంట్ చేయనున్నారు. రూ. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్‌ వర్చువల్‌గా జమ చేయనున్నారు. ఈక్రమంలో గురువారం ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఇళ్ల లబ్ధిదారులకు సీఎం జగన్ వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు.