iDreamPost
android-app
ios-app

AP ఫలితాలపై తొలిసారి CM జగన్ స్పందన.. చరిత్ర సృష్టించబోతున్నామంటూ!

  • Published May 16, 2024 | 1:31 PM Updated Updated May 16, 2024 | 1:35 PM

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. చరిత్ర సృష్టించబోతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. చరిత్ర సృష్టించబోతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

  • Published May 16, 2024 | 1:31 PMUpdated May 16, 2024 | 1:35 PM
AP ఫలితాలపై తొలిసారి CM జగన్ స్పందన.. చరిత్ర సృష్టించబోతున్నామంటూ!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గతంలో లేని విధంగా ఈ సారి ఏపీలో భారీగా పోలింగ్‌ నమోదయ్యింది. ఎక్కడెక్కడో ఉన్న జనాలు.. సొంత ఊర్లకు తరలి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు అర్థరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది అంటే.. ఓటర్లు ఎంత భారీ ఎత్తున తరలి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫలితాలపై అధికార, విపక్ష పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఐదేళ్లలో తాము చేసిన మేలే.. మరోసారి తమను గెలిపిస్తుంది అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు తమ పార్టీకే ఓటు వేశారని.. కచ్చితంగా 150కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు సీఎం జగన్‌. మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌.. గురువారం నాడు ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఫలితాలపై జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని.. 2019 కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. 2019లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు గెలిచాం. ఈ సారి అంతకన్నా ఎక్కువ గెలవబోతున్నాం. ప్రశాంత్‌ కిషోర్‌ ఊహించనన్ని సీట్లలో మనం విజయం సాధించబోతున్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు ఇంతకన్నా ఎక్కువ మంచి చేద్దాం. జూన్‌ 4 ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేస్తాం’’ అంటూ ఫలితాలపై జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.