iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన జగన్‌ సర్కార్‌..

  • Published Sep 20, 2023 | 2:11 PM Updated Updated Sep 20, 2023 | 2:11 PM
  • Published Sep 20, 2023 | 2:11 PMUpdated Sep 20, 2023 | 2:11 PM
ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన జగన్‌ సర్కార్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. వారిపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న ఉద్యోగుల డిమాండ్స్‌ నెరవేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు ఏవి అంటే.. పదవి విరమణ చేసిన ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంతేకాక ఉద్యోగి రిటైర్డ్‌ అయ్యే సమయానికి వారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యత అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అలానే ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌ అయిన తర్వాత.. వారి పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్‌ వర్తింస్తుందని తెలిపారు.

అలానే అమ‌రావ‌తిలో ఉద్యోగుల‌ ఉచిత వ‌స‌తికి సంబంధించి జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఉద్యోగులకు కల్పిస్తోన్న ఉచిత వసతిని మరో ఏడాది పొడిగిస్తూ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ వరకు ఉచిత వసతి అవకాశం ఉంది. తాజా నిర్ణయం ప్రకారం 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు.