iDreamPost
android-app
ios-app

అధికారమంటే పెత్తనం కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం: సీఎం జగన్‌

అధికారమంటే పెత్తనం కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం: సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన  తరువాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. నవరత్నాల పేరుతో ఎన్నో స్కీమ్ లను ప్రారంభించి.. ప్రజల మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. అంతేకాక ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏకారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్ల ను సీఎం జగన్ అందజేశారు.  గురువారం సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలోనే ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యల చేశారు.

గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత ఉండి.. లబ్ధిపొందని అర్హులకు బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1.49 లక్షల మందికి పెన్షన్లు, 4 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2 లక్షల మందికి రేషన్‌ కార్డులు, 12 వేల మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది.  ఈ  సందర్భంగా సీఎం జగన్ కీలక విషయాలు వెల్లడించారు. కులం​, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నామన్నారు.

అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమేని సీఎం అన్నారు. అర్హుల ఉన్న వారికి కొత్త పెన్షన్‌, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నామని సీఎం తెలిపారు. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో  వెయ్యి ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి చేరిందన్నారు. ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనదని, ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత నాదని సీఎం జగన్  అన్నారు. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు.  మరి.. సీఎం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: MLA ఆర్కే గొప్ప మనసు.. ఆపత్‌ కాలంలో గర్భిణికి సాయం!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis