iDreamPost
android-app
ios-app

‘YSR రైతు దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్!

‘YSR రైతు దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్!

నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆయన పుట్టిన రోజును రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఓ పండగాల జరుపుకుంటారు. అలానే ఏపీ ప్రభుత్వం కూడా ఆయన జయంతి రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది.  ఈ ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం వైఎస్సాఆర్ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.  రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ దుర్గంలోని ఏపీ మోడల్  స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై  డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రారంభించారు. అలానే 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్న అందించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ… “తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానేత డాక్టర్ వైఎస్సార్. ఆయన జయంతిని రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము.  ఏ పథకం చూసిన వైఎస్సార్ గుర్తుకు వస్తారు. వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు గుర్తోస్తాయి.  అదే విధంగా మన ప్రభుత్వం కూడా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఖాతాల్లో పంటబీమా పరిహారం జమ చేస్తున్నాం.  2022 ఖరీఫ్ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టాము. ఈ నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  10.2 లక్షల మంది రైతులకు  లబ్ధి చేకూరనుంది.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు రూ.7,802 కోట్లు చెల్లించింది.  ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు బీమా పరిహారంగా చెల్లంచింది కేవలం రూ.3,411కోట్లు.  అలానే మన ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అనేక సేవలు అందిస్తున్నాం. రైతు ఇబ్బంది పడొద్దన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58, 767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం.  మొత్తంగా నాలుగేళ్లలో రైతుల సంక్షేమ కోసం రూ1,70,769 కోట్లు ఖర్చు చేశాం. అలానే రైతులకు పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం.

రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. ఇక చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్ లు ఏర్పాటు చేశాం. అలానే పశువుల సమస్యలను తెలియజేసేందుకు 1962 అనే  ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్ సంస్థను తీసుకొచ్చాం.” అని రైతులకు అందించిన సంక్షేమ ఫలాల గురించి సీఎం జగన్ తెలిపారు. మరి.. సీఎం జగన్ ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.