iDreamPost
android-app
ios-app

అంబేడ్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు: CM జగన్!

YS Jagan: భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు, బలహీన వర్గాల ఆశ జ్యోతి డా.బి.ఆర్. అంబేడ్కర్ కు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. మతాతీతమైన విగ్రహాల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైనది ఈ మహనీయుడి విగ్రహం రూపొందింది.

YS Jagan: భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు, బలహీన వర్గాల ఆశ జ్యోతి డా.బి.ఆర్. అంబేడ్కర్ కు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. మతాతీతమైన విగ్రహాల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైనది ఈ మహనీయుడి విగ్రహం రూపొందింది.

అంబేడ్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు: CM జగన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ మహాశిల్పాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఎల్లో మీడియాపై ఆగ్రహాం వ్యక్తం చేశారు పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ  మేధావి, పేదల పాలిట ఆశ జ్యోతి అయినా డా.బీ.ఆర్ అంబేడ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం ఆయన చేసిన గురి వర్ణాతీతం. నేడు ఎంతో మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారు అత్యున్నతమైన పదవుల్లో ఉంటున్నారు అంటే అందుకు కారణం ఆ మహనుభావుడే. ఇక ఆయన ఆశయాలను నిజం చేస్తూ… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ముందుకు సాగుతున్నారు. అంతేకాక ప్రపంచలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇక అంబరాన్ని అంటుకునేలా ఉన్న ఈ అంబేడ్కర్ విగ్రహం అందరిని ఆకట్టుకుంది.  శుక్రవారం ఈ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన  సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ..పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకపోవడం అంటరానితనమేని అన్నారు. అదే విధంగా పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే అవుతుందని సీఎం తెలిపారు. పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే అని ఆయన అన్నారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదని సీఎం జగన్ అన్నారు. మన ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదని, అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చదని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

ఇంకా ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘ పెత్తందారులు రియల్‌ ఎస్టేట్‌ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం. పెత్తందారులకు దళితులంటే చులకన. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు అవసరం లేదు. గతంలో చంద్రబాబు ప్రజల కోసం ఎందుకు బటన్‌ నొక్కలేకపోయారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారు’’ అంటూ సీఎం జగన్‌ ఫైర్ అయ్యారు. మరి.. చంద్రబాబు, ఎల్లో మీడియాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.