iDreamPost
android-app
ios-app

YSR సంపూర్ణ పోషణ– టేక్‌ హోం రేషన్‌ పంపిణీని ప్రారంభించిన CM జగన్

YSR సంపూర్ణ పోషణ– టేక్‌ హోం రేషన్‌ పంపిణీని ప్రారంభించిన CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.  అంతేకాక తరచూ పథకాల పనితీరుపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలానే బాలింతలకు, గర్భవతుల్లో రక్తహీనత  చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి వాటిని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నిర్దేశించుకున్న ప్రమాణఆలతో అంగన్ వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలానే మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ తరచూ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటారు. అంగన్ వాడీల పనితీరుపై, అర్హులకు అందుతున్న పౌషకాహారల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు.

ఇప్పటికే పలుమార్లు  మహిళా, శిశు  సంక్షేమ శాఖపై సీఎం సమీక్షలు నిర్వహించారు. తాజాగా బుధవారం కూడా మరోసారి ఈ శాఖపై  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  సమీక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి.. ఉషాశ్రీ చరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి, మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ ఎండీ ఎ బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండ్యన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎ విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలానే పలువురు మహిళలు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

అలానే వైఎస్సార్ సంపూర్ణ పోషణ– టేక్‌ హోం రేషన్‌ పంపిణీని కార్యక్రమాని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం  బాలింతలకు, గర్భిణీలకు .. వైఎస్సాఆర్ సంపూర్ణ పోషకాహార కిట్ ను అందజేశారు. అందులో బియ్యం, పప్పులు, గుడ్లు, పాలు వంటి తదితర పౌష్టికాహార పదార్థాలు ఉన్నాయి. అలానే నేటి నుంచి గర్భవతులు, బాలింతల సౌకర్యార్ధం ఇంటికే పోషకాహార కిట్ ను పంపిణీ చేయనున్నారు. బాలింతలు, గర్భవతులు అంగన్ వాడీకి వెళ్లే క్రమంలో పడే ఇబ్బందులు సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో వారి ఇంటికే ఈ పోషకాహార కిట్ ను అందించేలా సీఎం జగన్  చర్యలు తీసుకున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై  గర్భవతులు, బాలింతలు సంతోష వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలా ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సీఎం మంచి మనసు..అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక సాయం!