Arjun Suravaram
YSR Aarogyasri Scheme: ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యం అంటూ పరిపాలనలో దూసుకువెళ్తున్నారు.
YSR Aarogyasri Scheme: ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యం అంటూ పరిపాలనలో దూసుకువెళ్తున్నారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్య, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పేద ప్రజలకు చికిత్స విషయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య శ్రీలో వ్యాధుల చికిత్స సంఖ్యను పెంచడం చేశారు. తాజాగా ఆరోగ్య శ్రీ విషయంలో మరో చరిత్రాత్మ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోనుంది. ఆరోగ్య శ్రీ అమౌంట్ ను రూ.25 లక్షల వరకు పెంచనున్నారు. తాజాగా ఆరోగ్య శ్రీపై సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక విషయాలపై అధికారులతో సీఎం చర్చించారు.
బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించున్నారు. ఇక సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీలో రూ.25 లక్షల వరకూ చికిత్స అందించడం అనేది ఏపీలో చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని తెలిపారు.
ఈహక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత, అందుకనే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై ఎంతో కృషి చేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే అందుకు ఉదాహరణ అని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్ష వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందని ప్రభుత్వం భరోసా ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా ఆరోగ్య శ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని తెలిపారు.
అలానే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉద్దానం గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని ఆదేశించారు. డయాలసీస్ రోగులు వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు. ఇక ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆరోగ్య శ్రీ సీఈఓ డీకే బాలజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి.. ఆరోగ్య శ్రీని రూ.25 లక్షల పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.