AP మహిళలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. ఖాతాలో డబ్బులు జమ

YSR Asara Scheme Funds: ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతల్లో ముందు వరుసలో ఉంటారు వైఎస్‌ జగన్‌. దీనిలో భాగంగానే నేడు మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

YSR Asara Scheme Funds: ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతల్లో ముందు వరుసలో ఉంటారు వైఎస్‌ జగన్‌. దీనిలో భాగంగానే నేడు మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో భాగంగా ఈ నిధులు విడుదల చేయనున్నారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం.. డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను తనే చెల్లిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు విడతల్లో.. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు చెల్లించగా.. నేడు నాల్గవ విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు అనగా జనవరి 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకం నిధుల్ని విడుదల చేయనున్నారు. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని.. నేడు 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు. చివరి నాలుగవ విడత నిధులను మంగళవారం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. రాష్ట్రంలోని డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ 11 వరకు మహిళలు తీసుకున్నటువంటి రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం.. నాలుగు విడతల్లో వారికి తిరిగి చెల్లించనుంది. వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్- 0863-2347302 ఇమెయిల్ ఐడి-supportmepma@apmepma.gov.in ద్వారా తెలుసుకోవచ్చు అని సూచించారు.

వైఎస్సార్‌ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా మహిళలకే అందజేయడమే కాక.. ఆ మొత్తాన్ని వారు దేనికైనా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. ఆయా వర్గాల వారి ఆదాయం కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్‌ ఆసరా పథకం వల్ల.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది. వై

అర్హతలు..

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
  • డ్వాక్రా గ్రూపులో సభ్యురాలై ఉండాలి.
  • ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, లోన్ డాక్యుమెంట్ ఉండాలి.
  • నివాస ధృవనతంకం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి.
  • ఒకవేళ అర్హత ఉండి కూడా అకౌంట్‌లో డబ్బులు జమకాకపోతే అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Show comments