అసెంబ్లీ సాక్షిగా బాబు స్కామ్ ఆనాడే బయటపెట్టిన CM జగన్

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చోటుచేసుకున్న కుంభకోణం వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బాబు రూ. 371 కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు తేలడంతో సీఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి తాడేపల్లిలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీ సాక్షిగా ఈ స్కిల్ స్కామ్ ను బయటపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్కామ్ కు బాబు ఎలా పథకం వేశాడు. ఏ విధంగా నిధులు దారిమళ్లించి కుంభకోనానికి పాల్పడ్డాడో కళ్లకు కట్టినట్లు వివరించారు. స్కామ్ బయటపడకుండా చాలా చాకచక్యంగా బాబు వ్యవహరించాడని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి వివారల్లోకి వెళ్తే..

గత అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ స్కామ్ పై మాట్లాడిన సీఎం జగన్.. స్కిల్ స్కామ్ కు బాబు ఎలా తెరలేపాడో వివరించారు. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది అని తెలిపారు సీఎం జగన్. సీఐడి, ఈడీ, ఐటీ, జీఎస్టీ, ఇంటలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బాబు ఆయన మనుషులు ఒక ముఠాగా ఏర్పడి ఈ స్కామ్ కు పాల్పడి రూ. 371 కోట్లను దోచుకున్నారని తెలిపారు. యూత్ కు శిక్షణ పేరిట ఈ డబ్బును దోచేయడం చాలా బాధాకరం అని అన్నారు. సీమెన్స్ ఇండియా కంపెనీలోని ఓ వ్యక్తితో లోపాయికారి ఒప్పందం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు.

దీనిపై ఎల్లో మీడియా స్పందించలేదని ఆఖరికి వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాన్ కూడా ఈ కుంభకోనంపై అడగలేదని ఆరోపించారు సీఎం జగన్. సీమెన్ కంపెనీలో ని వ్యక్తుల ద్వారా ఓ డీపీఆర్ ను రూపొందించి దానిని స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుంచి నోట్ పెట్టించారని తెలిపారు. ఆ తర్వాత దానిని కేబినెట్ లోకి తీసుకు వచ్చి ఆమోదం వేశారని వెల్లడించారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచేసిన తీరుకు సరైన ఉదాహరణ ఈ స్కామ్‌ అని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో విచారణ అంటూ జరిగితే ఎలా తప్పించుకోవాలో ముందుగానే చంద్రబాబు ఊహించారని సీఎం జగన్‌ అన్నారు. అసలు కేసు విచారణే జరపకుండా చంద్రబాబు ఎంతో గొప్ప విజన్‌తో వ్యవహరించారని జగన్‌ విమర్శించారు.

Show comments