iDreamPost
android-app
ios-app

ప్రజల వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే: CM జగన్ కీలక వ్యాఖ్యలు!

సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావైద్యం  పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావైద్యం  పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రజల వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే: CM జగన్ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు  తీసుకొచ్చారు. ముఖ్యంగా పేద ప్రజల వైద్యంకి పెద్ద పీఠ వేస్తోన్నారు. ఈ క్రమంలోనే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. ఇటీవలే ఇంటింటికి వైద్యం అందేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ పై సీఎం జగన్.. కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రజావైద్యం  పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు  మాములు వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తి స్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం జగన్.. అధికారుల వద్ద ప్రస్తావించారు.

సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే.. రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నదానిపై అధికారులకు  సూచించారు.  ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ….జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనదని తెలిపారు. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని సీఎం తెలిపారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తైంది. శిబిరాల్లో గుర్తించిన రోగులకు చేయూతనివ్వడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.

ఆరోగ్య సురక్ష శిబిరాలు సాధారణమైన సాధారణ వైద్య శిబిరాలు కావని అన్నారు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతదని సీఎం జగన్ పేర్కొన్నారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైందని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఆరోగ్యం పూర్తిగా నయం అయ్యేంత వరకూ చేదోడుగా నిలవడమే  ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అడుగుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించాం. రోగులకు శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.

ఇప్పటిక వరకు 1.44 కోట్ల కుటుంబాల్లోని సభ్యులకు  స్క్రీనింగ్‌ పూర్తిచేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు.జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ ఉండాలని ఆదేశించారు. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలని, నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని సీఎం సూచించారు.  ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుంది.  దీని కారణంగా సంతృప్తకరంగా సేవలు అందుతాయి. ఆరోగ్య పరంగా ఎవరికీ ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యత అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.