Arjun Suravaram
YS Jagan: శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలానే ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Jagan: శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలానే ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
కొన్ని రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎంతో ఉత్కంఠతను తలపించిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్న బీఆర్ఎస్ కు నిరాశే మిగిలింది. తెలంగాణ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఇక ఆ ఎన్నికల ఘట్టం ముగియగానే అందరి దృష్టి ఏపీపై పడింది. ఇక్కడ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న ఇప్పుడే ఆ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాల గురించి సీఎం జగన్, మంత్రులు చర్చించారు. ఇదే సమయంలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా? అనే అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి వర్గం భేటీలో ఎన్నికల అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలా షెడ్యూలు ముందస్తుగా వచ్చిన ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో సీఎం వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని, అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని మంత్రి సమావేశంలో సీఎం జగన్ అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని సీఎం మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని మీడియాల్లో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.
అంతేకాక ప్రత్యర్థి పార్టీల అంచనాలకు కూడా అందని విధంగా సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే 11 మంది నియోజవర్గ ఇంఛార్జ్ లను మార్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికల ముందే సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఏ చిన్న అవకాశం లేకుండా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేలా అందరిని సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.