Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి.. రెండిటిని జోడెద్దులో పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూనే.. మరొక వైపు వివిధ అభివృద్ధి పనులతో దూసుకెళ్తున్నారు. అలానే రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోట ప్రాంతం అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆదివారం గండికోట ప్రాంతంలో ఒబెరాయ్ హోటళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట ప్రాంతంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తిరుపతి , వైజాగ్ ఒబెరాయ్ హోటల్స్ కు కూడా వర్చువల్ విధానంలో శంకుస్థాపన్ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిల్చుకునే గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు. ఒక్కరోజే మూడు చోట్ల ఒబెరాయ్ హోట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. ఒబెరాయ్ లాంటి పెద్ద సంస్థ ఇక్కడకు వచ్చి సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోందన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి సెవెన్ స్టార్, ఫైవ్ స్టార్ లాంటి హోటల్స్ కడితే. గండికోట గ్లోబల్ టూరిజం మ్యాప్ లోకి చేరుతుందని తెలిపారు.
ఇంకా సీఎం మాట్లాడూతూ..” ఒబెరాయ్ హోటల్ రావడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఈ హోటల్ వల్ల ప్రత్యేక్షంగా, పరోక్షంగా దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒబెరాయ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక దిక్చూచిగా ఉపయోగపడుతుంది” తెలిపారు. ఇక పులివెందుల ప్రాంతంలో రూ.142.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభించారు. పురపాలక భవనం, సిటీ ఫారెస్టు, గరండాల రివర్ గార్డెన్, నైపుణ్య శిక్షణ అకాడమీ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయోసైన్స్ కేంద్రం, వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్టస్ అకాడమీని ప్రారంభించారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.