iDreamPost
android-app
ios-app

చిన్నారికి సీఎం జగన్ ఆర్ధిక సాయం..!

  • Published Dec 01, 2023 | 12:34 PM Updated Updated Dec 01, 2023 | 12:34 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సందర్భాల్లో తన కాన్వాయ్ ఆపి మరీ బాధితుల సమస్యలు అడిగి తెలుసుకొని తక్షణ సాయం అందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సందర్భాల్లో తన కాన్వాయ్ ఆపి మరీ బాధితుల సమస్యలు అడిగి తెలుసుకొని తక్షణ సాయం అందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

  • Published Dec 01, 2023 | 12:34 PMUpdated Dec 01, 2023 | 12:34 PM
చిన్నారికి సీఎం జగన్ ఆర్ధిక సాయం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో ఉన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేసే పనులు మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకొని మనసున్న మహరాజు అనిపించుకున్నారు సీఎం జగన్. గతంలో పలుమార్లు తన కాన్వాయ్ ఆపి మరీ అపదలో ఉన్నవారికి తక్షణమే ఆర్థిక సహాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని తక్షణమే సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నంద్యాలోని అవుకు రెండో టన్నెల్ గురువారం ప్రారంభించిన అనంతరం కొంతమంది అభాగ్యులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎంతో ఓపికగా బాధితులు చెప్పిన కష్టాల గురించి విన్నారు. ఈ క్రమంలోనే అవుకు మండలం గోకుల దిన్న గ్రామానికి గుర్రప్ప, సౌమ్య దంపతులకు ఇద్దరు సంతానం. గుర్రప్ప ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి రెండో పాప హర్షిత ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి చికిత్స చేసిన వైద్యులు గుండెలో రంద్రం ఉందని తెలిపారు. దీంతో గుర్రప్ప దంపతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం పాపకు ఇరవై నెలలు. ఆపరేషన్ చేయిస్తే నయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక సహాయకం కోసం అనేక చోట్ల తిరిగారు. అసలే పేదరికంతో బాధపడుతున్న తమకు ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలని టెన్షన్ పడుతున్న సమయంలో స్థానిక వైసీపీ నేతలు సీఎం జగన్ కి అర్జీ పెట్టుకుంటే సాయం అందుతుందని తెలిపారు.

నంద్యాల జిల్లా అవుకు లో గురువారం రెండో టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గుర్రప్ప, సౌమ్య కలిశారు. తమ కూతురు ఆరోగ్య పరిస్థితి గురించి విన్నవించుకన్నారు. పాప పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ తక్షణమే రూ.లక్ష రూపాల చెక్ అందించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పాప ఆరోగ్యానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ ని ఆదేశించారు. అలా చిన్నారి ఆదుకొని మనసున్న మహరాజు అనిపించుకున్నారు వైఎస్ జగన్. తమ కూతురుకి మరో కొత్త జీవితాన్ని ఇచ్చారని దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తమ బాధ అర్థం చేసుకొని సీఎం జగన్ పెద్ద మనసు చేసుకొని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. అదే సమయంలో మరో బాధితుడిని పరిస్థితి గురించి తెలుసుకొని రూ.5 లక్షల ఆర్తిక సాయం అందించాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్ ను ఆదేశించారు.