iDreamPost
android-app
ios-app

తెలంగాణలో YSRCP విస్తరణపై ..CM జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

YS Jagan, Telangana: ఏపీ రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. అధికారంలోకి రావాలని ఎవరి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహలు, ప్రణాళికలు రచిస్తూ..ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ అంశంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Jagan, Telangana: ఏపీ రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. అధికారంలోకి రావాలని ఎవరి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహలు, ప్రణాళికలు రచిస్తూ..ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ అంశంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో YSRCP విస్తరణపై ..CM జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మరోసారి అధికారంలోకి వస్తాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా  ఆయన ముందుకు సాగుతున్నారు. తన అందించిన సంక్షేమ పథకాలే తమ పార్టీని అధికారంలోకి తీసుకోస్తాయని ఆయన  ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. ఇది ఇలా ఉంటే వైఎస్సార్ సీపీ తెలంగాణలో కూడా ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తెలంగాణలో వైఎస్సార్ సీపీ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఏపీ రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. అధికారంలోకి రావాలని ఎవరి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహలు, ప్రణాళికలు రచిస్తూ..ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూనే.. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం వంటి అనేక విషయాల గురించి సీఎం జగన్ క్లియర్ కట్ గా చెప్పారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానంటూ, మరోసారి విజయం తమదేనని స్పష్టం చేశారు. జూన్ 4 తరువాత సీఎం గా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ విస్తరణ ఏమైనా ఉంటుందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీని పక్కరాష్ట్రమైన తెలంగాణలో విస్తరించే ఆలోచనలో తాను లేనని స్పష్టం చేశారు. తాను పూర్తిగా  ఏపీపై దృష్టి సారించినట్లు తెలిపారు. తన జీవితం చాలా చిన్నదని, ఈ జీవితకాలంలో ఏపీ ప్రజలకు చిరకాలం మిగిలిపోయేలా సంక్షేమం, అభివృద్ది చేయాలని, అలానే ఆ మంచి ద్వారా జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని సీఎం జగన్ తెలిపారు.

తాను ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే ఉన్ననని రోజూలు అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే తమ ఎజెండా అని సీఎం జగన్ స్పష్టం చేశారు. హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారని.. ఆయన కారణంగానే రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణలో వైఎస్సార్ సీపీ విస్తరణపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.