iDreamPost
android-app
ios-app

సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌కే చుక్కలు చూపించిన లాయర్‌ సుధాకర్ రెడ్డి

సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌కే చుక్కలు చూపించిన లాయర్‌ సుధాకర్ రెడ్డి

స్కిల్ స్కామ్ కేసుపై రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న తరుణంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబు జైలుకా లేదా బెయిల్ అనే సందిగ్దానికి తెరపడినట్లైంది. సీఐడీ వాధనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఈ విధమైన తీర్పును వెల్లడించింది. చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ అన్ని రూల్స్ పాటించిందని ఏసీబీ కోర్టు తెలిపింది. ఇక సీఐడీ తరపున ఏసీబీ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కీలక సమయంలో వివరణాత్మక వాదనలను కోర్టు ముందుంచారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్దంగా దారిమళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడిని నిన్న(శనివారం) ఉదయం నంద్యాలలో అరెస్టు చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి తరలించింది. అనంతరం సిట్ అధికారులు కొన్ని గంటల పాటు విచారించి రిమాండ్ రిపోర్టును రికార్డ్ చేశారు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో నిందితుడైన బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో బాబు తరపును సుప్రీం కోర్టు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

సీఐడీ రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు వివరించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందు నుంచి ఎఫ్ఐఆర్ లో బాబు పేరును ఎందుకు చేర్చలేదు.. ఇప్పుడు ఎందుకు చేర్చారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. ఆ సమయంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జికి సరియైన విరణలు ఇచ్చారు. దీంతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబుకు జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. కోర్టులో వాదన సమయంలో సుప్రీం కోర్టు లాయర్ లూథ్రాకు నీళ్లు నమిలేలా చేశాడు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.