Tirupathi Rao
Police Notice To CM Ramesh: అనకాపల్లి పార్లమెంట్ స్థానం బీజీపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
Police Notice To CM Ramesh: అనకాపల్లి పార్లమెంట్ స్థానం బీజీపీ అభ్యర్థి సీఎం రమేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం అంతకంతకూ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేశ్ కు పోలీసులు షాకిచ్చారు. ఆయన వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో పోలీసులు సీఎం రమేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇటీవల చోడవరంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదు అయ్యింది. అంతేకాకుండా శనివారం నర్సీపట్నంలోని కృష్ణా ప్యాలెస్ లో బేజీపీ కార్యకర్తల సమావేశం ఒకటి నిర్వహించారు. ఆ సమావేశంలో కార్యకర్తలకు చీరలు పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది.
అనకాపల్లి పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ వ్యవహారశైలి పలు వివాదాలకు తావిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నర్సీపట్నంలో కార్యకర్తల సమావేశంలో సీఎం రమేశ్ చీరల పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం సీఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు సహా.. ఎన్నికల అధికారులు కృష్ణా ప్యాలెస్ కు చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులపై సీఎం రమేశ్ రివర్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు తమ పార్టీ గుర్తు తెలియజేసేలా కమలం గుర్తు ఉన్న చీరలను పంపిణీ చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. అక్కడకు వచ్చారని అధికారులపైనే ఆయన రివర్స్ లో చిందులు తొక్కారు. అసలు అవి తాయిలాలు కాదు ఉంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన ఘటన నేపథ్యంలో సీఎం రమేశ్ కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్ లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించేదుకు వెళ్లగా వారికి దాడికి దిగారు. అలాగి వారి విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో సీఎం రమేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలి అంటూ అనకాపల్లి ఎస్ డీపీవో ఆదేశిచారు. సీఎం రమేశ్ మాత్రమే కాకుండా చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్స్ 353, 342, 506, 201, 188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో సీఎం రమేశ్ తిరిగి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై ఆరోపణలు చేయడం విస్తుపోయేలా చేస్తోంది. అయితే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సీఎం రమేశ్ ఆరోపణలు ఖండించారు. సీఎం రమేశ్ తోపాటు టైల్స్ వ్యాపారి బుచ్చిబాబుపై కూడా పరువు నష్టం దావా వేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. వారి రౌడీయిజాన్ని ఉత్తరాంధ్రలో చూపించాలి అనుకుంటే తాము చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు. సీఎం రమేశ్ కు నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.