తండ్రి కోరిక నెరవేర్చేందుకు ఆలయాన్ని నిర్మిస్తున్న ముస్లిం సోదరులు!

Chittoor: భారత దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. సమాజంలో కులమతాలకు సంబంధిచిన గొడవలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం కుల మతాలకు అతీతంగా పదిమందికి ఆదర్శంగా జీవిస్తుంటారు.

Chittoor: భారత దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. సమాజంలో కులమతాలకు సంబంధిచిన గొడవలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం కుల మతాలకు అతీతంగా పదిమందికి ఆదర్శంగా జీవిస్తుంటారు.

దేశంలో కొంతమంది స్వార్థపరులు కులం, మతం అడ్డు పెట్టుకొని కలిసి మెలిసి ఉన్న వాళ్ల మధ్య గొడవలు పెడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అనే ప్రసక్తి లేకుండా హిందూ,ముస్లిం, క్రిస్టియన్స్ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. గతంలో ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి స్థలం లేకపోతే మసీదుకు చెందిన స్థలాన్ని ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. అలాగే ఆయల భూముల్లో మసీదు నిర్మాణానికి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇద్దరు ముస్లిం సోదరులు తమ తండ్రికోరిక మేరకు ఆలయ నిర్మాణం చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ముస్లిం ఫ్యామిలీలోని ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం చేపట్టిన ఆలయ నిర్మాణ కార్యక్రమం నేటికీ సాగుతుంది. చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కె కొత్తపేట గ్రామానికి చెందిన ఫిరోజ్, చాంద్ భాషా అన్నదమ్ములు. తమ తండ్రి అజిజ్ భాషా కోరిక తీర్చాలని భావించారు.గతంలో తండ్రి కోరిక మేరకు ఆంజనేయ స్వామి సహా సప్తపది ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా అన్నదమ్ములు మాట్లాడుతూ.. ‘తాము ఆంజనేయ స్వామిని పూజించడానికి ఒక కారణం ఉందని.. తమ తాతకు సంతానం కలగకపోవడంతో ఓ స్వామీజీ హనుమంతుడిని పూజించమని సలహా ఇచ్చాడట. ఆ పూజల ఫలితంతగా తమ తండ్రి అజీజ్ భాష జన్మించాడని, అందుకే తమ తండ్రికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమని.. ఆయన కోరిక మేరకు తాము ఆలయాన్ని నిర్మిస్తున్నాం’ అని అన్నారు.

2010 లో సప్తపది ఆలయం నిర్మాణం చేపట్టామని.. ఈ ఆలయ ప్రాంగణంలో ఏడుగురు దేవతా మూర్తులను ప్రతిష్టస్తామని అన్నారు. ఈ ఆలయాన్ని తమ సొంత డబ్బుతో నిర్మిస్తున్నామని.. తామే తాపీ మేస్త్రీ, కూలీలం అని చెప్పారు. ఈ ఆలయంలో హనుమంతు, వినాయకుడు, శివుడు, సాయి బాబాలను ప్రతిష్టించామని అన్నారు. ఎవరైనా దాతలు తమ ఆలయ నిర్మాణానికి స్పందించి విరాళం అందిస్తే మిగిలిన దేవతా మూర్తుల విగ్రహాలను ప్రతిష్టామని చెబుతున్నారు. తమ ఆర్థిక శక్తికి మించినదే అయినా ఈ పని చేయడంలో తమకు ఎంతో సంతృప్తి ఉందని అంటున్నారు అన్నదమ్ములు. మతసామరస్యంతో ముందుకు సాగుతున్న ఈ అన్నదమ్ములపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments