iDreamPost
android-app
ios-app

ఎల్లలు దాటిన ప్రేమ కథలు.. ఒకరిది జర్మనీ, మరొకరిది నేపాల్

  • Published Feb 15, 2024 | 1:14 PM Updated Updated Feb 15, 2024 | 1:14 PM

ఈ కాలంలో ప్రేమ కథలు రాష్ట్రాలు, దేశాలు దాటి పోతున్నాయి. హద్దులు చెరిపేసి.. ఖండాంతరాల్లో ఉన్న ప్రేయసిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు..

ఈ కాలంలో ప్రేమ కథలు రాష్ట్రాలు, దేశాలు దాటి పోతున్నాయి. హద్దులు చెరిపేసి.. ఖండాంతరాల్లో ఉన్న ప్రేయసిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు..

  • Published Feb 15, 2024 | 1:14 PMUpdated Feb 15, 2024 | 1:14 PM
ఎల్లలు దాటిన ప్రేమ కథలు.. ఒకరిది జర్మనీ, మరొకరిది నేపాల్

ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు కొంత మంది యువకులు. ఖండాతరాలు దాటి.. మరొక దేశానికి చెందిన అమ్మాయితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి.. ప్రేమించిన యువతి మెడలో మూడు ముళ్లు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ప్రేమ కథలు, పెళ్లిళ్లు చూశాం. అలా అని సచిన్- సీమా హైదరీ, అంజు- నస్రుల్లా తరహా లవ్ స్టోరీస్ కావు వీరివి. చదువులు, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన అబ్బాయిలు.. అక్కడ తన మనస్సుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు తమ విదేశీ ప్రియురాళ్లను వివాహం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం గుంతూరుకు చెందిన భాష్యం సుదర్శన్ నాయుడు కుమారుడైన అఖిల్ జర్మనీలో ఓ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. అక్కడ అతడికి ఆండ్రియా అనే అమ్మాయి పరిచయమైంది. ఆండ్రియా అదే యూనివర్శిటీలో యోగా టీచర్‌గా పనిచేస్తోంది. అక్కడ ఏర్పడ్డ పరిచయం, ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసకువాలని నిర్ణయించుకుని పెద్దలకు వీరి విషయం చెప్పారు. వారు ఒప్పుకోవడంతో తెలుగు సాంప్రదాయ పద్దతుల ప్రకారం.. వీరి వివాహం జరిగింది. కాణిపాకంలోని వరసిద్ది వినాయక ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం..ఈ వివాహ తంతు ముగిసింది. ఈ పెళ్లికి ఆండ్రియా తల్లిదండ్రులు, బంధువులు ఇండియాకు రావడంతో పాటు హిందూ సంప్రదాయాల ప్రకారం జరుగుతున్న పెళ్లి చూసి మురిసిపోయారు.

అలాగే పెనుమూరులో కూడా మరో జంట పెళ్లి పీటలు ఎక్కింది. పెనమూరులో స్థిరపడిన బి. ముకుంద నాయుడు, ధనలక్ష్మి రెండో కుమారుడు భువన్ కృష్ణ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, తన కంపెనీలో పనిచేస్తున్న కొలిగ్ జి మనీలను ప్రేమించాడు. ఆమెది మన పొరుగు దేశమైన నేపాల్. నాలుగేళ్ల పాటు లవ్ చేసుకున్న ఈ జంట.. తమ విషయాన్ని ఇంట్లో చెప్పి.. పెళ్లికి ఒప్పించుకున్నారు. పేరెంట్స్ ఒప్పుకోవడంతో చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో భువన్, మనీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు వచ్చి.. ఈ నూతన దంపతులను ఆశీర్వదించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet