iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేళ అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. అవ్వ తాతల ముందు దోషిగా?

Nara Chandrababu: త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. మే 13న ఎన్నికల జరగనుండగా, జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎన్నికల వేళ ఓ విషయంలో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది.

Nara Chandrababu: త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. మే 13న ఎన్నికల జరగనుండగా, జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎన్నికల వేళ ఓ విషయంలో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది.

ఎన్నికల వేళ అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. అవ్వ తాతల ముందు దోషిగా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమ్మర్ హీట్ తో పోటీ పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… ఎండల వేడిని ముంచి ఏపీ పొలిటికల్ హీట్ ఉంది. గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. తాను చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అలా ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు చేసిన కుట్రతో.. ఆయనే అడ్డంగా బుక్కయ్యారు. అంతేకాక ఆయన చేసిన పనికి అవ్వతాతల ముందు దోషిగా నిలబడ్డారనే టాక్ వినిపిస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. నిమ్మగడ్డ రమేశ్ ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబే..నిమ్మగడ్డ చేత ఆ ఫిర్యాదు చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. వాలంటీరు ఇంటింటికి వెళ్లి ఇస్తే.. సీఎం జగన్ కి అనుకూలం అవుతుందని చంద్రబాబు భావించారని తెలుస్తోంది. అందుకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వడం ఆపేయాలని భావించి.. నిమ్మగడ్డ చేత ఈసీకీ ఫిర్యాదు చేయించారు.

CBN

ఫలితంగా వాలంటీర్ల సేవలు నిలిచిపోయి.. వృద్ధులు, వింతవులు ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్ ల సేవల రద్దు చేసి..తానేదో లబ్ధి పొందాలని చూసిన బాబు.. అడ్డంగా బుక్కయ్యారని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్..వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖ్ నే  ఇంటికి వెళ్లి  పెన్షన్ అందించేవారు. తాజాగా టీడీపీ చేసిన కుట్ర కారణంగా వారందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ  దుస్థితికి కారణం చంద్రబాబే అనే భావన అందరిలో ఏర్పడింది. వాలంటీర్ ల ద్వారా అందించే  పెన్షన్ నిలిపివేసి.. చంద్రబాబు ..అవ్వాతాతల ముందు దోషిగా మారాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

చంద్రబాబు చేసిన నిర్వాకం వలన నడవలేని వృద్దులు ఎండలో సచివాలయకు వస్తున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు తాము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అని అవ్వాతాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. మొత్తంగా  ఎన్నికల వేళ చంద్రబాబు వేసిన వ్యూహం బెడి కొట్టిందని, ఆయన చేసిన పనికి టీడీపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.