Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరిట 240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీఐడీ శనివారం ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అదుపులోకి తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరిట 240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీఐడీ శనివారం ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అదుపులోకి తీసుకుంది.
Venkateswarlu
సీమెన్స్ స్కాం కేసులో ఏపీ సీఐడీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరిట 240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీఐడీ శనివారం ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు ఆయన్ని నంద్యాల నుంచి విజయవాడ తరలిస్తున్నారు.
ఏపీ సీఐడీ నెక్ట్స్ ఏం చేయబోతోంది?
ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడ్ని విజయవాడ తరలిస్తున్నారు. సొంత వాహనంలోనే ఆయన్ని విజయవాడ తీసుకెళుతున్నారు. మొదట ఆయన్ని విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఆ తర్వాత విజయవాడ మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ స్కాం, చంద‍్రబాబు నాయుడి అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది.
కాగా, చంద్రబాబునాయుడ్ని నాన్ బెయిలబుల్ నేరం కింద ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి.. చంద్రబాబు రిమాండ్‌కు సంబంధించి మేజిస్ట్రేట్‌కు సీఐడీ అధికారులు విజ్ఞప్తులు చేయనున్నారు. చంద్రబాబు రిమాండ్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ రిమాండ్‌కు అవకాశం ఇస్తే.. అధికారులు ఆయన్ని రిమాండ్‌లో ఉంచి విచారణను కొనసాగించే అవకాశం ఉంటుంది. కాగా, ఉదయం అరెస్ట్ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. తనను అరెస్ట్ చేసిన అధికారులను బాబు పలు ప్రశ్నలు వేశారు. అధికారులు ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి మరీ, విజయవాడకు తీసుకువస్తున్నారు. మరి, చంద్రబాబు సీమెన్స్ స్కాంలో అరెస్ట్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.