iDreamPost

చంద్రబాబుకి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది: CID చీఫ్

  • Published Sep 09, 2023 | 11:58 AMUpdated Sep 09, 2023 | 12:36 PM
  • Published Sep 09, 2023 | 11:58 AMUpdated Sep 09, 2023 | 12:36 PM
చంద్రబాబుకి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది: CID చీఫ్

ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబు ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇవాళ ఆయనను విజయవాడ సీఐడీ కోర్టులో హాజరు పర్చబోతున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఆయన కారులో రోడ్డు మార్గం గుండానే విజయవాడకు తరలిస్తున్నామని అన్నారు. ఇక చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన కారణాలపై సీఐడీ అదనపు డీజీ ఎన్ జంజయ్ మంగళగిరిలో సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సీఐడీ అదనపు డీజీ ఎన్ జంజయ్ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబుని ఆరుగంటల ప్రాంతంలో నంద్యాలలో అరెస్టు చేశాం. ఈ స్కామ్ లో ఆయన ప్రదాన కుట్రదారుడుగా ఆరోపణలు వచ్చాయి. ఫైనల్ బెనిఫిషియర్ కూడా చంద్రబాబు నాయుడే. ఏపీ ప్రభుత్వం సిమెన్స్ తో జరిగిన ఒప్పందంలో గత ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసింది. షెల్ కంపెనీల భారీ స్కాం జరిగినట్లు తెలుస్తుంది. ఈ కుంభకోణానికి మూల సూత్రదారి చంద్రబాబు అని తేలింది. ఆయన హయాంలో ప్రభుత్వం తరుపు నుంచి ఆదేశాలు ఇవ్వడం, ఎంవోయూ కుదుర్చుకోవడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పపడ్డారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రాబు నాయుడిని అరెస్ట్ చేశాం.  120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ కింద చంద్రబాబు నాయుడిపై కేసులు నమోదు  చేశాం.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కాం పూర్తి వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టోడియల్ విచారణ అవసరం ఉంది. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకోని చద్రబాబు ని అరెస్టు చేశాం.  జీఎస్టీ, ఈడీ అధికారులు ఈ స్కామ్ పై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో మాకు లభించిన ఆధారాలు అన్నింటిని సంబంధిత కోర్టు ముందుఉంచుతాం. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అలాగే ఆధారాలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ముందుగానే చంద్రబాబుని అరెస్టు చేశాం. తీవ్ర ఆర్థిక నేరాలనికి పాల్పడినందుకు చట్ట ప్రకారం పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఐటీ శాఖ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. సాంకేతికంగా నేరు రుజువు కావాల్సి ఉంది, ఇది చాలా విస్తృతమైన దర్యాప్తు అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి