Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. 23 సెంటిమెంట్ బాగా వైరలవుతోంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున గెలిచిన ఈ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి పదవులు సైతం ఇచ్చారు. ఈ క్రమంలో 2019 మే 23వ తేదీన వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 23 సీట్లు మాత్రమే సాధించింది. ఈ ఫలితాలపై సోషల్ మీడియాలో ఎన్ని మీమ్స్ పేలాయో అందరికి తెలిసిందే. దేవుడి స్క్రిప్ట్‌ను ఎవరూ మార్చలేరంటూ.. చంద్రబాబు మీద సెటైర్లు వేశారు నెటిజనులు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాటి నుంచి ఈ 23 సెంటిమెంట్.. చంద్రబాబును బాగా వెంటాడుతోంది. ఇక తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ తర్వాత 23 సెంటిమెంట్ రిపీట్ అవ్వడంతో.. దేవుడి స్క్రిప్ట్ మాములుగా లేదు కదా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనను సెప్టెంబర్ 9, 2023న అరెస్ట్ చేశారు. అనగా 9-9-23. ఈ మొత్తాన్ని కూడితే.. 23 వస్తుంది. అలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబర్ కేటాయించారు. దీన్ని మొత్తాన్ని కూడితే.. 23 వస్తుంది. దాంతో నెటిజనులు.. చంద్రబాబుని 23 సెంటిమెంట్ ఇప్పట్లో వదిలేలా లేదు. కర్మ ఫలితం అనుభవించ తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మంట్ కేసులో ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి 1 గంట తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఏసీబీ కోర్టు.. ఆయనకు జైలులో ప్రత్యేక గది కేటాయించడమే కాక.. వసతి, సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేసింది.