iDreamPost
android-app
ios-app

చంద్రబాబు చేసిన ఆ తప్పే జగన్ ఆయుధం?

ఎప్పుడూ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగానే కనిపిస్తుంటాయి. ప్రత్యర్థి  ఏ చిన్న తప్పు చేసిన.. దానిపై జరిగే ఇష్యూ అంతాఇంతా ఉండదు. అలానే గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాంటి ఆయుధాలుగా మారాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్.

ఎప్పుడూ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగానే కనిపిస్తుంటాయి. ప్రత్యర్థి  ఏ చిన్న తప్పు చేసిన.. దానిపై జరిగే ఇష్యూ అంతాఇంతా ఉండదు. అలానే గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాంటి ఆయుధాలుగా మారాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్.

చంద్రబాబు చేసిన ఆ తప్పే జగన్ ఆయుధం?

రాజకీయాల్లో  ప్రత్యర్థి చేసిన తప్పులను నాయకులు ఆయుధాలుగా చేసుకుంటారు. అవి తప్పులను పదే పదే ప్రస్తావిస్తూ.. ప్రజలకు తెలియజేస్తుంటారు. తాజాగా ఏపీ రాజకీయం విషయానికి వస్తే.. అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. సాధారణంగా ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటాయి. ప్రత్యర్థి  ఏ చిన్న తప్పు చేసిన.. దానిపై జరిగే ఇష్యూ అంతాఇంతా ఉండదు. అలానే గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాంటి ఆయుధాలుగా మారాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం జగన్ ప్రతి ప్రసంగంలో చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతుంటారు.

తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. టీడీపీ హయాంలో  చంద్రబాబు చేసిన తప్పులను ప్రస్తావిస్తూ.. సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం  తన కోసం, తన గజదొంగల ముఠా కోసమే. పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగులు కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదన్నారు. ఆ పెద్ద మనిషికి దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని, చంద్రబాబు పేరు చేబితే అన్ని స్కామ్ లే గుర్తుకు వస్తాయని  సీఎం జగన్ మండిపడ్డారు.

రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి. రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. మనస్సున్న మన ప్రభుత్వానికి మనసులేని ఆ ప్రభుత్వానికి  ఉన్న తేడాను గమనిచండంటూ సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “చంద్రబాబు పరిపాలన అంతా స్కామ్ లే. ఆయనకు స్కీమ్ లు చేత కాదు. డీబీటీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను” అంటూ సీఎం తెలిపారు. చంద్రబాబు మాత్రం ఆ రోజు ఇస్తాని మాట తప్పారు.  సంపూర్ణ రుణ మాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, బంగారు నగలతో సహా విడిచిపెడతానని హామీ ఇచ్చారు. అయితే ఈ నాలుగు హామీల్లో కేవలం పావు వంతు మాత్రమే జరిగిందని పొలిటికల్ సర్కిల్ లోని చాలా మంది అభిప్రాయం. సంపూరణ రుణ మాఫీ అనేది జరగలేదని, కొంత పరిధి పెట్టి ఆ మేరకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇక బంగారు నగల విషయానికి వస్తే.. అసలు విడిపించలేదు.

అదే విధంగా డ్వాక్రా రుణమాపీ అసలు చేయలేదు. చివర్లో పసుపు కుంకుమ కింద పది వేలు మాత్రమే వేశారు. ఇలా చంద్రబాబు చేసిన తప్పులే జగన్ కు ఆయుధాలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక బాబు చెబితే మాటతప్పుతారు. జగన్ చెబితే.. చేస్తాడంతే.. అనే మాటలను సీఎం జగన్.. జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. పుట్టపర్తి మీటింగ్ లో సీఎం జగన్ అదే ప్రస్తావించారు. భవిష్యత్తులోనూ అదే అంశాలను పట్టుకుని ముందుకెళ్తారు. ఇలా చంద్రబాబు తప్పే సీఎం జగన్ కి ఆయుధంగా మారిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.