iDreamPost
android-app
ios-app

వీడియో: అంబులెన్స్ కు దారివ్వని చంద్రబాబు

  • Published Sep 06, 2023 | 10:11 PM Updated Updated Dec 11, 2023 | 12:52 PM

అంబులెన్స్ ను అడ్డుకోవడమే కాకుండా అక్కడి నుంచి వెనక్కి పంపించిన దృశ్యాలు ఆ నాయకుల ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇట్టే తెలిసి పోతుంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ ను టీడీపీ నాయకులు అడ్డుకుంటుండగా, కనీసం వారి అధినాయకుడు వారించకుండా మిన్నకుండి పోవడంతో ఇది చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ర్యాలీల పేరుతో సామాన్యుల ప్రాణాలు తీస్తారా అంటూ జనాలు మండిపడుతున్నారు.

ఆపదలో ఉంటే ఆదుకునేది పోయి అత్యుత్సాహంతో అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబులెన్స్ ను అడ్డుకోవడమే కాకుండా అక్కడి నుంచి వెనక్కి పంపించిన దృశ్యాలు ఆ నాయకుల ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇట్టే తెలిసి పోతుంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ ను టీడీపీ నాయకులు అడ్డుకుంటుండగా, కనీసం వారి అధినాయకుడు వారించకుండా మిన్నకుండి పోవడంతో ఇది చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ర్యాలీల పేరుతో సామాన్యుల ప్రాణాలు తీస్తారా అంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రచార రథాన్ని రోడ్డుకు అడ్డంగా నిలిపారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో రోడ్డు అంతా రద్దీగా మారింది. అయితే ఇదే సమయంలో ఓ పేషెంట్ ను తీసుకుని వస్తున్న అంబులెన్స్ కు దారివ్వకుండా టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అంబులెన్స్ కు దారివ్వాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఇదంతా గమనిస్తున్న చంద్రబాబు అంబులెన్స్‌ కు దారివ్వలేదు. అంతేగాక అంబులెన్స్‌ను టీడీపీ నేతలు వెనక్కి పంపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ-సర్కిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.