iDreamPost
android-app
ios-app

సుప్రీంకోర్టుకు 9 రోజులు సెలవులు.. చంద్రబాబు పరిస్థితి ఏంటి?

  • Published Sep 24, 2023 | 4:34 PMUpdated Sep 24, 2023 | 4:34 PM
  • Published Sep 24, 2023 | 4:34 PMUpdated Sep 24, 2023 | 4:34 PM
సుప్రీంకోర్టుకు 9 రోజులు సెలవులు.. చంద్రబాబు పరిస్థితి ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి.. ఏపీ హైకోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. అంతేకాక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన అరెస్ట్‌ను ఖండిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ని.. ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ నెల 26 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు అని తెలుస్తోంది. అంటే చంద్రబాబు పిటిషన్‌ విచారణకు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.

సోమవారం అనగా సెప్టెంబర్‌ 25న.. చంద్రబాబు పిటిషన్‌ విచారణకు సంబంధించి కీలకంగా మారనుంది. ఒకవేళ సోమవారం రోజున చంద్రబాబు పిటిషన్‌ విచారణకు రాకపోతే.. ఇక అంతే పరిస్థితి. ఎందుకంటే.. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 3 వరకు.. 9 రోజుల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. కనుక సెప్టెంబర్‌ 25న అనగా సోమవారం.. చంద్రబాబు పిటిషన్‌ విచారణకు వచ్చేది ఉందా.. లేదా.. అనే దాని మీద తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి