iDreamPost
android-app
ios-app

నాడు తాను ప్రారంభించిన జైలు బ్లాక్‌లోనే నేడు రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు

  • Published Sep 13, 2023 | 12:55 PM Updated Updated Sep 13, 2023 | 4:06 PM
  • Published Sep 13, 2023 | 12:55 PMUpdated Sep 13, 2023 | 4:06 PM
నాడు తాను ప్రారంభించిన జైలు బ్లాక్‌లోనే నేడు రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషిన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం చంద్రబాబు భార్య, ఆయన కుమారుడు, కోడలు ఆయనని కలిశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా.. తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు సంబంధించి ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫొటో ఏంటంటే.. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఏ బ్లాక్‌లో అయితే ఉన్నారో.. దాని ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటో ఇది.

ఏడేళ్ల క్రితం అనగా.. 2016, నవంబర్‌ 19న ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా ఉన్న బ్లాక్‌ను ఆయనే ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో నూతన పరిపాలనా భవనం.. కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం, ప్రారంభోత్సవ తేదీ 19-11-2016, ప్రారంభకులు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివర్యులు అని రాసి ఉంది. ఇక నాడు తాను ప్రారంభించిన బ్లాక్‌లోనే నేడు.. చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్లో జైల్లో ఉన్న చంద్రబాబుకు.. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక గది, మెడిసిన్, ఆహారం అందించేందుకు ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేశారు.