కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‪లో నాలుగు అవార్డు గెలుచుకున్న AP!

Swach Survekshan-2023: కేంద్ర ప్రభుత్వం జాతియ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను అందిస్తుంది. స్వచ్ఛతను గట్టిగా పాటిస్తున్ననగరలాకు, రాష్ట్రాలకు ఈ అవార్డులు ప్రధానం చేస్తారు. ఈ ఏడాది ఏపీకి కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగాంలో అవార్డుల పంట పడింది.

Swach Survekshan-2023: కేంద్ర ప్రభుత్వం జాతియ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను అందిస్తుంది. స్వచ్ఛతను గట్టిగా పాటిస్తున్ననగరలాకు, రాష్ట్రాలకు ఈ అవార్డులు ప్రధానం చేస్తారు. ఈ ఏడాది ఏపీకి కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగాంలో అవార్డుల పంట పడింది.

ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగాంలో అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులతో పాటు రాష్ట్ర స్థాయిల అవార్డు కూడా గెల్చుకుంది. సౌత్ ఇండియాలోనే  క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా పలు అవార్డులు రావడంపై అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను అందిస్తుంది. స్వచ్ఛతను గట్టిగా పాటిస్తున్ననగరలాకు, రాష్ట్రాలకు ఈ అవార్డులు ప్రధానం చేస్తారు. ఏటా ఈ అవార్డులను ఢిల్లీలో ప్రధానం చేస్తుంటారు. 2023 ఏడాదికి గాను కూడా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీకి అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు వచ్చింది. గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్ సాధించింది. అలానే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు వచ్చిదిం. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డులను దక్కించుకుంది.

ఈ అవార్డునుల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు  నిదర్శమని మంత్రి సురేష్‌ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందని మంత్రి తెలిపారు. ఇదే సందర్భంలో మున్సిపల్ కార్మికలు సమ్మె గురించి మంత్రి ప్రస్తావించారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారని ఆయన తెలిపారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి అన్నారు.

కాగా, 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్‌’ అవార్డు దక్కింది. అలానే ఈ ఏడాది కూడా ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ లో అవార్డుల పంట పడింది. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు కారణంగా మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఏపీకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడమే నిదర్శనమని మేధావులు తెలిపారు. మరి.. ఏపీకి జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments