AP, తెలంగాణలకు భారీ సాయం చేసిన కేంద్రం!

AP and Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగింది

AP and Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఎంత దారుణంగా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఎంతో ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగింది. అందువల్ల కేంద్రం ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి భారీ సాయాన్ని ప్రకటించింది. ఏకంగా రూ. 3,300 కోట్ల సాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు తక్షణ సహాయ చర్యల కోసం విడుదల చేయడం జరిగింది. ఈ వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టపోయిన బాధితులకు సహాయం చేయడానికి కేంద్రం ఈ నిధులు కేటాయించింది.

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తు అయితే మాములుగా లేదనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. ఇక తెలంగాణాలో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అందుకోసం కేంద్రం ఇప్పుడు చర్యలు తీసుకుంది. ఈ నష్టంపై కూడా కేంద్రం ఆరా తీసి నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని ఆయన తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ సెక్రటేరియట్‌లో ఈ వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేసిన ఈ సాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments