Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్ర ప్రజకు శభవార్త! 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

తెలుగు రాష్ట్ర ప్రజకు శభవార్త! 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Andhra Pradesh and Telangana: ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత్ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు భారత రైల్వేలో ప్రయాణిస్తుంటారు. రైల్వే ప్రయాణం సురక్షితమే కాదు.. ఎంతో సౌకర్యవంతం. తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.

Andhra Pradesh and Telangana: ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత్ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు భారత రైల్వేలో ప్రయాణిస్తుంటారు. రైల్వే ప్రయాణం సురక్షితమే కాదు.. ఎంతో సౌకర్యవంతం. తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.

భారత రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సామాన్యుల నుంచి సంపన్ననుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణ ఖర్చులు ఎక్కువ, ఇతర సౌకర్యాలు ఉండవు. అంతేకాదు ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురి అవుతున్న విషయం తెలసిందే.అందుకే ప్రైవేట్ వాహనాలు అంత సురక్షితం కాదని భావిస్తుంటారు. చిన్నా, పెద్ద రైలు ప్రయాణాలు చేయాలంటే తెగ సంతోషపడుతుంటారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఇలా లక్షల సంఖ్యల్లో ప్రయాణిస్తుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త అందించింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఈ ప్రాజెక్టు వల్ల పలు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణం అన్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.24,657 కోట్లు అని పేర్కొంది. 8 ప్రాజెక్టుల్లో ఒకటి ఒకటి మల్కాన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కిలో మీటర్ల మేర మార్గం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్ గిరి (ఏపీ, తెలంగాణ, ఒడిశా) జిల్లాలను కవర్ చేస్తుంది.

ఈ సందర్బంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘ ఈ ప్రాజెక్ట్ 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం అన్నారు. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం, ఈ ఎనిమిది ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు ఒడిశాలోని దక్షిణ, పశ్చిమ భాగాల్లోని జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన నియోజకవర్గాల్లో అభివృద్ది గనణీయంగా పెరుతుతుంది, ఆరు వెనుకబడిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, రాయగడ, తూర్పు సింగ్ బం, మల్కన్ గిరి, కలహండి, నబరంగ్ పూర్ కు కనెక్టివిటీని మెరుగుపర్చడం ద్వారా దాదాపు 510 గ్రామాలు, 40లక్షల జనాభాకు మేలు కలుగుతుంది. ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 ప్రాజెక్టులలు భారతీ రైల్వేల ప్రస్తుతం నెట్ వర్క్ 900 కిలోమీటర్ల మేర పెరుగుతుందని’ అన్నారు.

 

Show comments