iDreamPost
android-app
ios-app

రాఘవేంద్రస్వామి సన్నిధిలో బ్రిటన్‌ ప్రధాని తల్లిదండ్రులు..

రాఘవేంద్రస్వామి సన్నిధిలో బ్రిటన్‌ ప్రధాని తల్లిదండ్రులు..

వివిధ దేశాలకు చెందిన ప్రముఖలు తరచూ భారతదేశంలోని ఆలయాలను దర్శిస్తుంటారు. అలానే  ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించి.. స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇటీవలే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతులు ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తల్లిదండ్రులు కూడా మంత్రాయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆయన సన్నిదిలో బ్రిటన్ ప్రధాని తల్లిదండ్రులు పూజలు నిర్వహించారు. వారి వెంటనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధానారాయణమూర్తి  ఉన్నారు.

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధానారాయణమూర్తితో కలిసి ఆమె అల్లుడు, బ్రిటన్‌ ప్రధాని అయినా రిషి సునాక్‌ తల్లిదండ్రులు కర్నూలు జిల్లా మంత్రాలయం వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యస్వీర్‌ సునాక్‌, ఉషా సునాక్‌ బుధవారం మంత్రాలయం వచ్చారు. వారికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు స్వాగతం పలికారు. యస్వీర్ దంపతులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. రాఘవేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి శ్రీసుబుదేంద్ర తీర్థులు  యస్వీర్ సునాక్ దంపతులకు శేషవస్త్రాలు అందించారు.

అలానే శ్రీ రాఘవేంద్రస్వామి చిత్రపటం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సుల సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతులు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని అక్షరధామ్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హిందువుగా ఉన్నందుకు తాను గర్విస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం రావడం అందరిని ఆకట్టుకుంది. మరి.. ఇలా బ్రిటన్ ప్రధాని కుటుంబం భారత్ దేశంలోని ఆలయాలను దర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.