దసరా పండగ నుంచి విశాఖ నుంచి పరిపాలన: సీఎం జగన్

దసరా పండగ నుంచి విశాఖ నుంచి పరిపాలన: సీఎం జగన్

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ముగిసింది. కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే పలు కీలకమైన బిల్లులకు ఏపీ మంత్రిమండలి  ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే సివిల్స్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు,  ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దసరా నాటి నుంచి విశాఖలో పరిపాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బుధవారం కేబినేట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేయాలనే అంశంపై చర్చించింది. అలానే ఈ బిల్లు అమలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  ఈబిల్లు అమలులలోకి వస్తే.. ఉద్యోగి రిటైర్డ్‌ అయినా సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కిందకి వచ్చేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలి. అలానే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో స్కీమ్ ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ సంబంధించిన బిల్లుకి కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లు, కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణ, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు,  దేవాదయ చట్ట సవరణ బిల్లుకి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అలానే దసరా నాటి నుంచి విశాఖలో పరిపాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విజయ దశమి నుంచే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించాలని మంత్రి మండలి ఆమోదం తెలిపింది.అప్పటి వరకు కార్యాలయాలను తరలిచాలని నిర్ణయించారు. విశాఖలో ఆఫీసుల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాలు ఉంటుందన్నారు. మరి.. ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments