iDreamPost
android-app
ios-app

పెళ్లై ఐదు రోజులే.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కుప్పకూలిన నవ వధువు

పెళ్లై 5 రోజులే అయ్యింది. నూతన జీవితంలోకి అడుగుపెట్టానన్న ఆనందానికి అవధుల్లేవు ఆ యువతికి. తమ కాపురం సజావుగా సాగిపోవాలని తిరుపతిలోని తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వెళ్లారు నవ దంపతులు. ఇలా వెంకటేశ్వరుడ్ని దర్శించుకుని ఇలా బయటకు వచ్చారో లేదో..

పెళ్లై 5 రోజులే అయ్యింది. నూతన జీవితంలోకి అడుగుపెట్టానన్న ఆనందానికి అవధుల్లేవు ఆ యువతికి. తమ కాపురం సజావుగా సాగిపోవాలని తిరుపతిలోని తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వెళ్లారు నవ దంపతులు. ఇలా వెంకటేశ్వరుడ్ని దర్శించుకుని ఇలా బయటకు వచ్చారో లేదో..

పెళ్లై ఐదు రోజులే.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కుప్పకూలిన నవ వధువు

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది యువతి. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆరు కాలాల పాటు సంసారం పచ్చగా ఉండాలని ఆశీర్వదించారు అతిధులు. ఇక మెట్టినింట్లో తన సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి వెళ్లాల్సిన నవ వధువు.. తిరుపతిలో కుప్పకూలి పోయింది. పెళ్లైన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వెళ్లారు దంపతులు. దర్శనం కూడా బాగా అయిందనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిలిస్తూ.. నూతన వధువు మరణించింది. మెట్టినింట్లో అడుగుపెట్టాల్సిన యువతి.. శ్మశానానికి తరలివెళ్లింది. ఈ దంపతులను ఆశీర్వదించిన పెద్దలు.. ఈ అమ్మాయి మరణవార్త విని కన్నీటి పర్యంతమౌతున్నారు.

ఈ నెల 23న వివాహమైన నవ వధువు.. తిరుపతిలోని శ్రీవారి కరుణా కటాక్షాల కోసం వెళ్లి.. భర్త చేతిలో జీవచ్ఛవంలా ఒరిగిపోయింది. కన్నీరు తెప్పిస్తున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన కొప్పురావురి రమేష్, సుధా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. రమేష్ వ్యాపార రీత్యా విజయవాడలో స్థిరపడ్డారు. పెద్దమ్మాయి లక్ష్మి సంతోషికి హైదరాబాద్‌కు చెందిన భార్గవ్‌తో సంబంధం ఖాయమైంది. ఈ నెల 23న భారీ యెత్తున పెళ్లి చేశారు తల్లిదండ్రులు. శ్రీవారి దర్శనం కోసం వధూవరులు ఈ నెల 27న తిరుమలకు వెళ్లారు. 28న వెంకటేశ్వరుడ్ని దర్శించుకుని బయటకు రాగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సంతోషి. తిరుమల విజిలెన్స్ సిబ్బంది సాయంతో ఆమెను బయటకు తీసుకు వచ్చి.. అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.

ఆసుప్రతికి వెళ్లే సరికి ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు, భర్త శోక సంద్రంలో మునిగిపోయారు. దర్శన సమయంలో శ్వాస ఆడక.. ఇబ్బంది పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండే శ్వాస సంబంధిత సమస్య ఉందని, క్యూలైన్లో వెళ్లే సమయంలో అలసటగా కనిపించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని బంధువులకు పోలీసులు, టీటీడీ వీజీవో, అశ్విని ఆసుపత్రి వైద్యుల సమక్షంలో అప్పగించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. టీటీడీ అంబులెన్స్‌లో నరసరావు పేటకు తరలించారు. అక్కడే భర్త ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.