iDreamPost
android-app
ios-app

పెళ్లి కూతురు పేరేంటి ఇంత పెద్దగా ఉంది!

  • Published Sep 04, 2023 | 3:19 PM Updated Updated Sep 04, 2023 | 3:19 PM
  • Published Sep 04, 2023 | 3:19 PMUpdated Sep 04, 2023 | 3:19 PM
పెళ్లి కూతురు పేరేంటి ఇంత పెద్దగా ఉంది!

సాధారణంగా ఎవరి పేరైనా ఒకటి లేదా రెండు పదాలు కలిపి ఉంటాయి. మహా అయితే ఐదు పదాలు కలిపి ఉండొచ్చు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే వార్తలో మాత్రం పెళ్లి కూతురు పేరు ఏకంగా 10 పదాలకు మించి ఉంది. పెళ్లి పత్రికలో ఆ పేరు చూసి బంధుమిత్రులతో పాటు.. నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేరేంట్రా మరీ ఇంత పెద్దగా ఉంది. అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని మండపేటకు చెందిన వీరభద్రరావు, వీర వెంకట సత్యవతిల కుమారుడు వెంకట నాగేశ్వర సాయి దీపక్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది.

కొద్దిరోజుల క్రితం పెళ్లి పత్రికను ముద్రించారు. పెళ్లి పత్రికలో పెళ్లి కూతురు పేరు చూసి అందరూ షాక్‌ అయ్యారు. ఆ పత్రికలో పెళ్లి కూతురు పేరు ‘‘ వీరవెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతీ రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష’’ అని ఉంది. ఇక, ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పత్రికలో పేరుపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘ పెళ్లి కూతురు పేరేంటి ఇంత పెద్దగా ఉంది’’.. ‘‘ అది పెళ్లి కూతురు ఒక్కదాని పేరేనా..

ఓ పది మంది పేర్లు కలిపి పెట్టారా?’’ ‘‘ ఇలాంటి పేరు నేను ఎక్కడా చూల్లేదు’’.. ‘‘ ఈ పేరులో ఏకంగా 15 మంది పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు కలిపి పెట్టారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి పత్రికను షేర్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే, ఆ పెళ్లి పత్రిక ఒరిజినలా? లేక ఎవరైనా ఫేక్‌ క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారా? అన్నది తెలియరాలేదు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పెళ్లి కూతురు పేరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet